P. V. Narasimha Rao- Modi: దివంగత ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలే కాదు… న్యాయ వ్యవస్థ కూడా స్వర్ణ యుగం తెచ్చారు.. డివై చంద్ర చూడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.. ఈయన తండ్రి వైవి చంద్రచూడ్ పేరొం దిన న్యాయమూర్తి. కిస్సా కుర్సికా కేసులో ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్ గాంధీని జైలుకు పంపిన చరిత్ర వైవి చంద్రచూడ్ ది. అయితే న్యాయవ్యవస్థ స్వతంత్రను కాపాడేందుకు తన తండ్రి మాదిరే తాను కూడా వ్యవహరిస్తానని డివై చంద్ర చూడ్ వెల్లడించారు. ఇదే సమయంలో ప్రొఫెసర్ సాయిబాబా కేసును అర్జెంటుగా విచారించేందుకు నిరాకరించిన ఆయన ఇప్పుడు భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అయితే ఈయన పదవి కాలంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండవ టర్మ్ చివరి ఏడాదిన్నర కాలం ముగియనుంది.. మోడీ హయాంలో తీసుకున్న అనేక నిర్ణయాలు, తీసుకోబోయే అనేక నిర్ణయాలు ఆయన హయాంలో సుప్రీంకోర్టు ముందుకు రాబోతున్నాయి.. ఈ సమయంలో న్యాయవ్యవస్థ పరిస్థితులు నాడు నేడుగా చూడాల్సి ఉంటుంది.. వ్యవస్థలను తమ ఆధీనంలో పెట్టుకున్న గాంధీ కుటుంబంతో పోలిస్తే… పీవీ నరసింహారావు కొన్ని కోట్ల రెట్లు ఉత్తమం. ఈ సందర్భంగా ప్రస్తుత ప్రధాని మోదీ, దివంగత ప్రధాని పీవీ నరసింహారావు న్యాయ వ్యవస్థ ఎన్నో మార్పులకు గురైంది.

న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి
న్యాయవ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే ఆ దేశం బాగుంటుంది.. స్వతంత్రత అనేది న్యాయవ్యవస్థకు ఆయువు పట్టు లాంటిది.. అందుకే దేశంలో చాలా వ్యవస్థలు సాగిలపడిపోయినప్పుడు వాటి బాధ్యత గుర్తు చేసింది న్యాయవ్యవస్థ. కార్యనిర్వాహక వర్గ నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ లోపాలను ఎంచుతుంది.. ఇదే సమయంలో కార్యనిర్వహకవర్గం న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తోంది. ఎందుకంటే ఈ అనుమానాలు గత కొన్ని సంవత్సరాలుగా కలుగుతున్నాయి కాబట్టి. ఒక ప్రజాస్వామ్యం పని తీరుపై ప్రజల విశ్వాసం పెరగాలంటే న్యాయవ్యవస్థ నిజాయితీగా పని చేయాలి.. అది అవసరం కూడా.. అవినీతికి, ప్రలోభాలకు న్యాయవ్యవస్థ అతీతం అని తేలినప్పుడు మాత్రమే ఈ విశ్వాసం మరింత పెరుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు.
పీవీ హయాంలో జరిగింది ఇది
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ వెంకటాచలయ్య ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు హాజరయ్యారు.. ఇద్దరూ పరస్పర గౌరవాభిమానాలతో పలకరించుకున్నారు. తర్వాత పివి ఆయనతో మాట్లాడుతూ ” జస్టిస్ వెంకటాచలయ్య గారూ మన మధ్య సుహృద్భావ సంబంధాలు ఉంటాయని నేను భావిస్తున్నాను” అని అన్నారు. జస్టిస్ వెంకటాచలయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా ” ప్రధానమంత్రి గారూ మన మధ్య సహృద్భావ వాతావరణం ఎలా ఉంటుంది? అలా ఉంటుంది అని నేను అనుకోవడం లేదు” అని అన్నారు. పీవీ నరసింహారావు ఒక చిరునవ్వు నవ్వి ” సరేనండి.. సుహృద్భావ సంబంధాల సంగతి అటు ఉంచండి. పరస్పర గౌరవం ఉంటే చాలు” అని జవాబు ఇచ్చారు.. దీని గురించి జస్టిస్ వెంకటాచలయ్య 2017లో విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో పీవీ నరసింహారావు గురించి స్మారక ఉపన్యాసం చేస్తూ వెల్లడించారు.. నాడు పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగ వ్యవస్థలు సుప్రీంకోర్టు మద్దతుతో స్వేచ్ఛగా పనిచేశాయి. సుప్రీంకోర్టు సిబిఐ కేసులను పర్యవేక్షించడం కూడా పీవీ హయాంలోనే ప్రారంభమైంది. సిబిఐ సుప్రీంకోర్టుకు జవాబుదారీగా ఉండాలి కానీ రాజకీయ నాయకత్వానికి కాదని నాడు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాదు నాటి సిబిఐ డైరెక్టర్ ని కూడా సుప్రీంకోర్టు బోనులో నిలబెట్టింది.. సిబిఐ పనితీరును పర్యవేక్షించే బాధ్యతను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు అప్పగించింది.

ఎన్నో మార్పులు వచ్చాయి
పివి హయాం తర్వాత ప్రధాన న్యాయమూర్తి పదవిని నిర్వహించిన 16 మందిలో 8 మంది అవినీతిపరులేనని మాజీ న్యాయశాఖ మంత్రి, న్యాయవాది శాంతిభూషణ్ 2010లో సుప్రీంకోర్టు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు.. న్యాయ వ్యవస్థలో ఎవరినైనా కొనుగోలు చేయొచ్చని నాడు గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్జె ముఖోపాధ్యాయ అనడం ఆ రోజుల్లో పెద్ద సంచలనం రేకెత్తించింది.. ఈ ఎనిమిది సంవత్సరాలలో సుప్రీంకోర్టు ప్రభుత్వ నియంత్రణకు లొంగిందని ఇటీవల ఢిల్లీ హైకోర్టు, మద్రాస్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన ఏపీ షా వెల్లడించారు.. పౌరసత్వ చట్టం, ఆర్టికల్ 370 రద్దు జోలికి ఎందుకు పోలేదు అన్నది చర్చనీయాంశం.. కానీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే ఎలక్టోరల్ బాండ్ల పథకం, హెబియస్ కార్పస్ కేసులను పట్టించుకోకపోవడం, కోవిటి సమయంలో వలస కూలీల దృష్టితిపై ప్రభుత్వ వైఖరినే సమర్థించడం, బావ వ్యక్తీకరణ సంబంధించి పది కేసుల్లో మూడింటిని మాత్రమే పట్టించుకోవడం, జస్టిస్ గొగోయ్ అనేక ముఖ్యమైన కేసుల్లో సమాచారాన్ని సీల్డ్ కవర్లో సమర్పించమని కోరడం వివాదాస్పదమయ్యాయి. ఇక భారత ప్రధానమంత్రిని ప్రశంసల్లో ముంచేత్తిన జస్టిస్ అరుణ్ మిశ్రా వ్యవహార శైలి కూడా వివాదాస్పదమైంది.. జస్టిస్ రమణ తర్వాత లలిత్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం 74 రోజుల పదవి కాలంలోనే తనదైన ముద్ర వేశారు. వందలాది పెండింగ్ కేసులను పరిష్కరించారు.. ఇక ఇప్పుడు చంద్ర చూడ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.. మోది తో ఢీకొంటారా? లేక సుహృద్భావ వాతావరణం కొనసాగిస్తారా? అనేది తేలాల్సి ఉంది.