Tuck Jagadish movie Review: టక్ జగదీష్ మూవీ రివ్యూ

మూవీ: టక్ జగదీష్ నటీనటులు: హీరో నాని, రీతూ వర్మ, ఐశ్వర్యరాజేశ్, జగపతి బాబు, దర్శకత్వం : శివ నిర్వాణ నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది బ్యానర్: షైన్ స్క్రీన్ సంగీతం: ఎస్ఎస్ థమన్ విడుదల: అమెజాన్ ప్రైమ్ (సెప్టెంబర్ 10) Tuck Jagadish movie Review: హీరో నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో ఇదివరకే ‘నిన్ను కోరి’ లాంటి క్లాసిక్ లవ్ స్టోరీ వచ్చింది. ఇప్పుడే అదే కాంబినేషన్ లో కుటుంబ […]

Written By: Raghava Rao Gara, Updated On : September 9, 2021 11:41 pm
Follow us on

మూవీ: టక్ జగదీష్
నటీనటులు: హీరో నాని, రీతూ వర్మ, ఐశ్వర్యరాజేశ్, జగపతి బాబు,
దర్శకత్వం : శివ నిర్వాణ
నిర్మాతలు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
బ్యానర్: షైన్ స్క్రీన్
సంగీతం: ఎస్ఎస్ థమన్
విడుదల: అమెజాన్ ప్రైమ్ (సెప్టెంబర్ 10)

Tuck Jagadish movie Review: హీరో నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో ఇదివరకే ‘నిన్ను కోరి’ లాంటి క్లాసిక్ లవ్ స్టోరీ వచ్చింది. ఇప్పుడే అదే కాంబినేషన్ లో కుటుంబ కథా చిత్రంగా.. కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ‘టక్ జగదీష్’ మూవీ రూపొందింది. నాని పక్కన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 10 అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయాలని అనుకున్నా.. ఒకరోజు ముందే స్పెషల్ ప్రీమియర్ తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..

– కథ:
జగదీష్ నాయుడు (నాని) తన కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తాడు. తన తండ్రి నాజర్ హఠాత్తుగా చనిపోవడంతో అన్నయ్య బోస్ బాబు (జగపతిబాబు)కు ఇంటి బాధ్యతలు అప్పగించి పట్నం వెళ్లిపోతాడు హీరో నాని. ఇకనాని తిరిగి వచ్చేసరికి అతడి మేనకోడలు చంద్రమ్మ(ఐశ్వర్యరాజేశ్) పెళ్లి వేరే వ్యక్తితో జరిగిపోతుంది. దీంతో టక్ జగదీష్ చాలా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోతాడు. ఈ లోగా ఆ భూదేవి పురంలో భూమి సమస్యలు.. కుటుంబంలోదాని వల్ల వచ్చిన ఇబ్బందులు.. ఊరిజనం తమ కుటుంబంపై తీవ్ర ఆగ్రహంతో ఉండడం చూసి జగదీష్ ఆ సమస్యను తీర్చేందుకు రంగంలోకి దిగుతాడు.. ఈ క్రమంలోనే అతడికి ఎదురైన పరిణామాలు.. కారకులు ఎవరు? చంద్రమ్మ పెళ్లి ఎవరితో చేశారు. కుటుంబాన్ని జగదీష్ ఎలా ఒడ్డున పడేశాడన్నది అసలు కథ.

-విశ్లేషణ
హీరో నాని ఎంచుకునే కథలే చాలా డిఫెరెంట్ గా ఉంటాయి. సహజ శైలికి దగ్గరగా ఉంటాయి. మన పక్కింటి కుర్రాడు ముందుకొచ్చి ఎలా ప్రవర్తిస్తాడే అంతే సహజత్వం నాని సినిమాలో ఉంటుంది. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ కూడా అలాంటి గ్రామంలోని ఓ కుటుంబం బాధల్లోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు. కమర్షియల్ హంగులతో పూర్తి కుటుంబ కథ చిత్రంగా ఎంటనర్ టైనర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ప్రేక్షకులను మెప్పించేలా తీశాడు. ఈ సినిమాలో గ్రామంలోనే కొట్లాటలు… పంతాలు పట్టింపులు వాటి వల్ల ఇబ్బందులు.. కుటుంబం కోసం హీరో నాని చేసిన పోరాటాలు మనకు చూపించారు. ఈ సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించకపోవచ్చని.. సినీ జనాలకు ఎక్కదని కూడా అంటారు.

హీరో నాని నటన మరోసారి పతాక స్థాయిలో ఉండగా.. మిగతా నటులు ఫర్వాలేదు. జగపతి బాబు, ఐశ్వర్యరాజేశ్, రీతూ వర్మ ఆకట్టుకున్నారు. కానీ సినిమా కథలో పస లేకపోవడంతో వారికి అంత స్కోప్ లభించలేదని అంటున్నారు. హీరోయిన్ రీతూవర్మ ఎలాంటి ప్రాముఖ్యత లేని పాత్రలో నటించిందని చెబుతున్నారు. సినిమాలోని పాటలు, సంగీతం అంతంతమాత్రమేనంటున్నారు.ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు కాస్త ఓవర్ అయ్యాయని చెబుతున్నారు. యావరేజ్ మూవీగా బాక్సాఫీస్ వద్ద నిలుస్తుందని అంటున్నారు. మొత్తంగా మంచి కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా చూడొచ్చని చెబుతున్నారు.

బాటమ్ లైన్: నాని మాత్రమే కనిపిస్తాడు.. నానిని అమితంగా అభిమానించే వారు చూడొచ్చు.

-oktelugu.com 2.5/5.0