Lakhimpur Kheri effect: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. కానీ ఇందులో వరణ్, మేనకా గాంధీలకు చోటు దక్కకుండా చేసింది. దీంతో వారిలో అసంతృప్తి నెలకొంది. 80 మందితో కూడిన జాతీయ కార్యవర్గంలో ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా తోపాటు సీనియర్లకు చోటు దక్కింది. తాజాగా మంత్రివర్గ విస్తరణలో పదవులు కోల్పోయిన రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేవకర్, హర్షవర్ధన్ వంటి వారికి కూడా చోటు కల్పించారు. కానీ ఇప్పటికే జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న వరణ్ గాంధీ, మేనకా గాంధీలకు మాత్రం చోటు దక్కలేదు.

కార్యవర్గంలో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 179 మంది శాశ్వత ఆహ్వానితులను కూడా నియమించారు. కానీ అందులో వరణ్, మేనకలకు చోటు కల్పించలేదు. దీంతో వారు అలకబూనారు. ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసినా తగిన గుర్తింపు ఇవ్వలేదని చెబుతున్నారు. ఇప్పటికే మంత్రి పదవులు దక్కలేదనే అక్కసుతో ఉన్న వరణ్, మేనకల భవిష్యత్ ఏంటనేది తెలియడం లేదు. కచ్చితంగా పార్టీపై కోపంతో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన లఖీంపూర్ ఘటనపై వరణ్ గాంధీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం జవాబుదారీతనం ప్రదర్శించాలని ట్వీట్ చేశారు. దీంతో ఆయనపై కక్ష గట్టినట్లు తెలుస్తోంది. కావాలనే వరుణ్ గాంధీని పక్కన పెట్టినట్లు సమాచారం. ప్రభుత్వమేదైనా హింసను ఎవరు ఉపేక్షించరు ఖండించాల్సిందే. కానీ ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పడంతో వరణ్ పై ఉన్న కోపంతోనే ఆయనను కార్యవర్గంలోకి తీసుకోనట్లు వార్తలు వస్తున్నాయి.
యోగి సర్కారుపై రాజకీయ నేతలు కాకుండా ఇతరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హింస ఎవరు చేసినా నేరమే కదా అనే ధోరణిలో కేంద్రం లేకపోవడం బాధాకరమేనని ప్రతిపక్షాలు సైతం దుమ్మెత్తిపోస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ కచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.