https://oktelugu.com/

Uttar Pradesh : వీడెవడండీ బాబు.. ఎమ్మెల్యే చెంపనే పగలగొట్టాడు

సాధారణంగా పెద్ద స్థాయి వ్యక్తులు వివాదాలకు దూరంగా ఉంటారు. ఒకవేళ తమ వాదనలు వినిపించే క్రమంలో ఫైర్ అవుతారు. కానీ ఓ న్యాయవాది మాత్రం.. ఏకంగా ఎమ్మెల్యే చెంపను పగలగొట్టడం విశేషం.

Written By: Dharma, Updated On : October 10, 2024 12:02 pm
Uttar Pradesh

Uttar Pradesh

Follow us on

Uttar Pradesh :  ఆయన ఓ సాధారణ న్యాయవాది. చిన్నపాటి వివాదంలో ఏకంగా స్థానిక ఎమ్మెల్యే చెంప పగలగొట్టారు.పోలీసులు చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ లో ఈ ఘటన జరిగింది. ఓ ఎన్నికల నేపథ్యంలో ఈ గొడవ జరగగా.. వీడియో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ లో బిజెపి ఎమ్మెల్యే యోగేష్ వర్మపై బహిరంగంగా దాడి జరిగింది. ఈ ఘటన కలకలం రేపింది. పదుల సంఖ్యలో పోలీసుల సమక్షంలోనే బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అవదేశ్ సింగ్ ఎమ్మెల్యే పై చేయి చేసుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ ట్రోల్ అవుతోంది. అక్కడి పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అర్బన్ కోపరేటివ్ బ్యాంక్ ఎన్నికల విషయంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అవదేష్ సింగ్, సదరు ఎమ్మెల్యే యోగేష్ వర్మ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం మొదలైంది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన అవదేశ్ సింగ్ పోలీసుల ఎదుటే ఎమ్మెల్యే యోగేశ్వర్న పై దాడికి పాల్పడ్డాడు. న్యాయవాదులంతా ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. అదే సమయంలో ఎమ్మెల్యే, అనుచరులు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అతి కష్టం మీద పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను విడదీశారు.

*కోఆపరేటివ్ ఎన్నికల్లో భాగంగా
అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు ఎన్నికల్లో భాగంగానే ఈ వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. బిజెపి నేతలు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఆ సమయంలో బార్ అసోసియేషన్ కు చెందిన న్యాయవాదులు కొన్ని అభ్యంతరాలు తెలిపారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే యోగేష్ వర్మ అక్కడకు చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా వివాదం కొట్లాటకు దారి తీసింది. అయితే అందరూ చూస్తుండగానే బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అవధేష్ సింగ్ దాడికి దిగడం సంచలనంగా మారింది.

* జాతీయస్థాయిలో చర్చ
జాతీయస్థాయిలో ఇది చర్చకు దారితీస్తోంది. దీనిపై బిజెపి హై కమాండ్ ఆరా తీసినట్లు సమాచారం. అయితే మరోవైపు ఇది రాజకీయ రగడకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పై చర్యలు తీసుకుంటే.. న్యాయవాదులు రాష్ట్రస్థాయిలో ఉద్యమానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అందుకే యూపీ ప్రభుత్వ పెద్దలు రాజీ కి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.