Ravana shot on the day of Dussehra: ప్రస్తుతం దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులను ఘనంగా జరుపుకుంటున్నారు. వీటితో పాటు దసరా వేడుకలను కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ప్రాంతాలను బట్టి ఈ దసరా పండుగలో మార్పులు ఉంటాయి. ప్రతీ ఏడాది ఆశ్వయుజ మాసంలో పదవ రోజున దసరా పండుగను అందరూ ఘనంగా జరుపుకుంటారు. నవరాత్రులు తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుని పదవ రోజు ఈ దసరా పండుగను జరుపుకుంటారు. అయితే దసరా పండుగ రోజు చాలా చోట్ల రావణుడిని కాలుస్తారు. సాధారణంగా దీపావళి పండుగకి రావణాసురుడిని కాలుస్తారు. కానీ దసరా పండుగకి కాల్చడం ఏంటని మనలో చాలా మందికి సందేహం ఉంది. దేశవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో రావణాసురుడిని కాల్చి ఘనంగా దసరా వేడుకలను జరుపుకుంటారు. ఖాళీ ప్రదేశాల్లో రావణాసురుడి దిష్టి బొమ్మను పెట్టి టపాసులతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అసలు దసరా పండుగకి రావణాసురుడికి సంబంధం ఏంటి? విజయదశమి రోజు ఎందుకు రావణాసురుడిని కాలుస్తారు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
దసరా పండుగ రోజు రావణాసురుడి బొమ్మను కాల్చడానికి ఓ కారణం ఉందట. విజయదశమి నాడు శ్రీరాముడు రావణుడిపై యుద్ధానికి వెళ్లి విజయం సాధించాడని చెబుతారు. అందుకే విజయదశమి పండుగ జరుపుకుంటూ.. రావణాసురుడు దిష్టి బొమ్మను కాల్చే సంప్రదాయం తీసుకొచ్చారని పురాణాలు చెబుతున్నాయి. మొత్తం పది రోజులు యుద్ధం చేయగా.. విజయదశమి రోజు రావణాసురుడిపై విజయం సాధించాడని ఈ పండుగ జరుపుకునే ఆచారం వచ్చిందని చెబుతారు. మరికొన్ని పురాణాలు ఏం చెబుతున్నాయంటే.. దుర్గాదేవి మహిసాసురునిపై పోరాడి అంతం చేసిందని అందుకే ఈ పండుగను జరుపుకుంటారని చెబుతారు. చెడుపై మహిమగల దుర్గాదేవి యుద్ధం చేసి విజయం సాధించినందుకు గానూ ఈ రోజు ప్రతీ ఒక్కరూ పండుగను జరుపుకుంటారు. ఎప్పటికైనా చెడు మీద మంచే గెలుస్తుందని.. కాకపోతే ఓపికతో ఉండాలని సూచిస్తూ రావణాసురుని దిష్టి బొమ్మను తగలబెడతారని కొందరు చెబుతున్నారు.
దేశవ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో విజయదశమి రోజు రావణాసురుడి దిష్టి బొమ్మను కాలుస్తారు. టపాసులు పేల్చి ఘనంగా నిర్వహిస్తారు. తమ జీవితాల్లో ఉన్న చెడు అంతా తొలగిపోవాలని భావిస్తూ రావణాసురుడి దిష్టి బొమ్మను తగలబెడతారు. ముఖ్యంగా కొన్ని ప్రదేశాల్లో పిల్లలతో ఈ బొమ్మను కాలిపించి టపాసులు పేలిస్తారట. తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల నుంచి దసరా నవరాత్రులను జరుపుకుంటూ పదవ రోజు విజయదశమి వేడుకలను జరుపుకుంటారు. కొత్త దుస్తులు ధరించి దసరా పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకుంటారు. దసరా రోజు రావణుడిని దహనం చేయడం వల్ల మనస్సులో ఉన్న చెడు ఆలోచనలు తొలగి, మంచితనంతో ఉంటారని భావించి చాలా ప్రదేశాల్లో కాలుస్తారు. రావణ దహనం తర్వాత కొన్ని ప్రదేశాల్లో అన్నం, బట్టలు, నీరు వంటివి దానం కూడా చేస్తారు. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందనే నమ్ముతారు.