spot_img
Homeజాతీయ వార్తలుMedaram Jatara: మేడారం జాతర ఉత్సవ కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా లచ్చు పటేల్‌!

Medaram Jatara: మేడారం జాతర ఉత్సవ కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా లచ్చు పటేల్‌!

Medaram Jatara: తెలంగాణ మహా కుంభమేళాకు మేడారం సిద్దమవుతోంది. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ధనసరిసీతక్క ఈమేరకు జాతర ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈనెల 21 నుంచి 24 వరకు జాతర జరుగుతుంది. ఈమేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జంపన్న వాగుపై స్నాన ఘట్టాలు, క్యూలైన్లు, తాగునీరు, రోడ్లు, బస్టాండ్‌ పనులు పూర్తయ్యాయి.

23న సీఎం, గవర్నర్, రాష్ట్రపతి..
ఫిబ్రవరి 23న సీఎం రేవంత్‌రెడ్డి, గవర్నర్‌ తమిళిసైతోపాటు రాష్ట్రపతి ముర్ము కూడా మేడారం వచ్చే అవకాశం ఉంది. ఈమేరకు మంత్రి సీతక్క ప్రకటించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

14న మండమెలిగే పండుగ..
మహాజాతర ప్రారంభానికి మరో 9 రోజుల సమయం ఉంది. ఇప్పటికే లక్షల మంది భక్తులు వన దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఫిబ్రవరి 11న కూడా భారీగా భక్తులు తరలివచ్చారు. ఇక, జాతర ప్రారంభానికి సూచికగా ఈనెల 14న మండమెలిగే పండుగ నిర్వహిస్తామని గిరిజన పూజారులు తెలిపారు.

ఉత్సవ కమిటీ ప్రకటన..
ఇదిలా ఉండగా సమ్మక్క–సారలమ్మ మహాజాతర ఉత్సవ కమిటీని దేవాదాయ శాఖ నియమించింది. చైర్మన్‌గా ఆరెం లచ్చుపటేల్, కమిటీ సభ్యులుగా మిల్కూరి ఐలయ్యా, కోడి గోపాల్, గంగెర్ల రాజారత్నం, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, యాప అశోక్, పోరిక నారాయణసింగ్, మంజుల భిక్షపతి, సుంచ హైమావతి, చామర్తి కిశోర్, కొరం అబ్బయ్య, ఆలం శశిధర్, వద్దిరాజు రవిచంద్ర, అంకం కృష్ణస్వామి, ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావును నియమించారు. చైర్మన్‌తోపాటు డైరెక్టర్లు సోమవారం ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ మొదటి వారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అవతార్ రికార్డ్స్...

The Odyssey Box Office : భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం. నిన్నగాక...
Oktelugu Epaper
Exit mobile version