https://oktelugu.com/

KTR Video Viral: ఈ ఒక్క వీడియోతో అడ్డంగా దొరికిన మంత్రి కేటీఆర్.. వైరల్

KTR Phone call Video Viral: మునుగోడులో అధికార టీఆర్ఎస్ కు పరిస్థితులు అంత అనుకూలంగా లేవని అర్థమవుతోంది. ఈ ఒక్క వీడియో సాక్ష్యంగా నిలుస్తోంది. ఎన్నో ఎన్నికలను ఒంటిచేత్తో గెలిపించిన మంత్రి కేటీఆర్ సైతం ఒక సాధారణ బీజేపీ కార్యకర్తను బతిమిలాడుతున్న వైనం చూస్తే ఖచ్చితంగా మునుగోడులో గులాబీ పార్టీ గందరగోళంగా ఉందని అర్థమవుతోంది. బీఆర్ఎస్ అంటూ జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్న కేసీఆర్ ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాల్సిన పరిస్థితి. ఇంట గెలవకపోతే ఇక […]

Written By:
  • NARESH
  • , Updated On : October 19, 2022 / 08:55 AM IST
    Follow us on

    KTR Phone call Video Viral: మునుగోడులో అధికార టీఆర్ఎస్ కు పరిస్థితులు అంత అనుకూలంగా లేవని అర్థమవుతోంది. ఈ ఒక్క వీడియో సాక్ష్యంగా నిలుస్తోంది. ఎన్నో ఎన్నికలను ఒంటిచేత్తో గెలిపించిన మంత్రి కేటీఆర్ సైతం ఒక సాధారణ బీజేపీ కార్యకర్తను బతిమిలాడుతున్న వైనం చూస్తే ఖచ్చితంగా మునుగోడులో గులాబీ పార్టీ గందరగోళంగా ఉందని అర్థమవుతోంది. బీఆర్ఎస్ అంటూ జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్న కేసీఆర్ ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాల్సిన పరిస్థితి. ఇంట గెలవకపోతే ఇక రచ్చ గెలవడం కష్టం. అందుకే మునుగోడును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. తొలిసారి మంత్రులు కేటీఆర్, హరీష్ ఇద్దరీనీ రంగంలోకి దింపారు. ఉప ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు.

    టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా తెలంగాణ టీఆర్ఎస్మంత్రులంతా రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్న కేసీఆర్ ఆదేశాలతో వారంతా కూడా చెమటోడుస్తున్నారు.

    ఇక ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. లేక వేరే ఇతర విషయాల్లోనూ ఎక్కడా దొరకని మంత్రి కేటీఆర్ తొలిసారి దొరికిపోయారు. ప్రత్యర్థి బీజేపీలోని బలమైన నాయకులను టీఆర్ఎస్ బాట పట్టించే ప్రయత్నం చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు.

    తెలంగాణ ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తాజాగా గట్టుపల్ మండలంలోని ఒక బలమైన బీజేపీ నేతకు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ సదురు నేతను టీఆర్ఎస్ లోకి రావాలని మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓటమి భయంతో బీజేపీ నేతలను బతిమిలాడుతున్న కేటీఆర్ అంటూ కమలం పార్టీ ఈ వీడియోను వైరల్ చేస్తోంది.

    మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత జగన్నాథంతో మంత్రి కేటీఆర్ ఫోన్లో సంభాషించారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకి సహకరించాలని.. మీరు కొంచెం సహకరిస్తే గట్టుప్పల్ అభివృద్ధి చేసుకుందామని కేటీఆర్ బతిమిలాడాడు. ఈ ఉప ఎన్నికతో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో నుంచి పోయేది లేదని..బీజేపీ అధికారంలోకి వచ్చేది లేదు’ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి బీజేపీ మనిషి కాదని.. అవకాశవాద రాజకీయం కోసం బీజేపీలో చేరారని.. ఆయన నియోజకవర్గాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదని కేటీఆర్ వీడియోలో పేర్కొన్నాడు. నియోజకవర్గంలో ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ.. సహకారం కోరారు కేటీఆర్.

    ఇక రైతు బంధును వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు కాదని.. కౌలు రైతులకు ఇవ్వాలని బీజేపీ నేత జగన్నాథం ఫోన్లో సూచించడం విశేషం. మొత్తానికి కేటీఆర్ తన ఫోన్ కాల్ ద్వారా బీజేపీ నేతకు గాలం వేశారు. కానీ దీన్ని బీజేపీ నేతలు వీడియో తీసి రిలీజ్ చేయడంతో కేటీఆర్ పరువు పోయింది. ఒక గల్లీ లీడర్ కోసం కేటీఆర్ ఇంతలా బతిమిలాడుతున్న వైనం చూస్తే ఆ పార్టీ మునుగోడులో గెలుపు కోసం ఎంతగా తండ్లాడుతుందో అర్థం చేసుకోవచ్చు. గెలుపు కష్టమేనన్న అంచనాలు నెలకొంటున్నాయి.