Ibomma Ravi Case Update: కొద్ది రోజుల క్రితం తెలంగాణ పోలీసుల చేతిలో అరెస్ట్ అయిన ఐ బొమ్మ రవి.. షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు. ఇతడిని విచారిస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఐ బొమ్మ రవి కి సంబంధించి మరొక సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈసారి కూడా షాక్ కు గురి కావడం పోలీసుల వంతయింది.
రవి ఐ బొమ్మ వెబ్ సైట్ ద్వారా కేవలం కొత్త సినిమాలను మాత్రమే కాదు, టెలిగ్రామ్ ఛానల్ ద్వారా థియేటర్లలో ఆడుతున్న సినిమాలను కూడా అందుబాటులో ఉంచేవాడు.. ఇందుకోసం అతడు ఏకంగా క్యూబ్ నెట్వర్క్ శాటిలైట్ లింక్ ను హ్యాక్ చేశాడు. హెచ్ డీ ఫార్మాట్ లో విడుదల చేసేవాడు. టెలిగ్రామ్ ఛానల్లో ఒక్కో సినిమాకు వంద నుంచి 300 డాలర్ల వరకు వసూలు చేసేవాడు. నాని నటించిన హిట్ 3, నాగచైతన్య నటించిన తండేల్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన కిష్కింధపురి సినిమాలను ఇలానే ఫైరసీ చేశాడు.
రవి కేవలం ఓటీటీలలో విడుదలను సినిమాలనే తన ఐ బొమ్మ వెబ్ సైట్ లో ఉంచేవాడని అందరూ అనుకున్నారు. కానీ అతడు దీన్ని అడ్డం పెట్టుకొని టెలిగ్రామ్ ద్వారా దండు కోవడం మొదలుపెట్టాడు. ఏకంగా క్యూబ్ నెట్వర్క్ శాటిలైట్ లింక్ ను హ్యాక్ చేసి, సినిమాలను డౌన్లోడ్ చేసి , తన టెలిగ్రామ్ చానల్లో అందుబాటులో ఉంచేవాడు. ఆ సినిమాలను పే పర్ వాచ్ రూపంలో చూసే విధంగా ఏర్పాటు చేసేవాడు. ఎక్కువగా వెస్ట్రన్ కంట్రీస్ లో ఈ విధానాన్ని అమలు చేసేవాడు. కొత్త సినిమాలను పైరసీ చేసి, దర్జాగా సంపాదించేవాడు.
రవి ఇలా సంపాదించిన డబ్బులతో విలాసవంతమైన జీవితాన్ని గడిపేవాడు. అంతేకాదు, ఐ బొమ్మ వెబ్ సైట్ ద్వారా బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసేవాడు. వాటి ద్వారా కూడా భారీగా సంపాదించాడు. రవికి గతంలోనే వివాహం జరిగింది. భార్యతో విడాకులు కూడా తీసుకున్నాడు.. ప్రస్తుతం అతడు ఒంటరిగానే ఉంటున్నాడు. కాకపోతే హ్యాకర్ గా భారీగా సంపాదిస్తూ.. విదేశాలలో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.. ఇప్పుడు అరెస్ట్ కావడంతో.. పోలీసులు విచారణ సాగిస్తున్న నేపథ్యంలో రోజుకో సంచలన నిజాన్ని బయటపెడుతున్నాడు.