Manchu Vishnu: కొంతమంది కామెడీ చెయ్యకపోయినావాళ్ళ మొహం చూస్తే వెంటనే నవ్వు వచ్చేస్తుంది..అలా ముఖం చూస్తేనే నవ్వు వచ్చే కమెడియన్స్ వెండితెర మీద లెజెండ్ బ్రహ్మానందం గారు అయితే..బయట మాత్రం మంచు విష్ణు అనే చెప్పొచ్చు..ఇతను మాట్లాడే మాటలు వింటే ఎలాంటి వాడికైనా నవ్వు రాక తప్పదు..వాటికి ఎవరైనా నవ్వుకుంటూ ట్రోల్ చెయ్యడం చాలా సహజం..దానికి ఇతగాడు తన తీరుని మార్చుకుంటాడా అంటే లేదు.

‘తన పై ఒక ప్రముఖ హీరో ట్రోల్ల్స్ వెయ్యిస్తున్నదని..దానికి జూబ్లీ హిల్స్ లో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ లో 20 మంది ఉద్యోగులు పని చేస్తున్నారని..అలా చేయిస్తున్న హీరో ఎవరో మీ అందరికి తెలుసు..ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు’ అంటూ మెగా ఫామిలీ పై నిందలు వేసుకుంటూ పబ్బం గడుపుతున్నాడు.
వాస్తవానికి మంచు విష్ణు ని ట్రోల్ చేసేదానికి ప్రత్యేకంగా డబ్బులిచ్చి మనుషులను పెట్టుకునేంత బుద్ది తక్కువ పని ఎవ్వడు చెయ్యదు..ఎందుకంటే మంచు విష్ణు ఒక హీరో అనే విషయం అందరూ ఎప్పుడో మర్చిపోయారు..మెగా ఫామిలీ లో ఒక హీరో కి మొదటి రోజు మొదటి ఆటకి వచ్చేంత కలెక్షన్స్ మంచు విష్ణు సినిమాకి వస్తే సూపర్ హిట్ అన్నట్టు లెక్క..అది ఆయన రేంజ్.
తిప్పి కొడితే వెయ్యి మంది కూడా ఉందని ‘మూవీ ఆర్టిస్టు అసోసియేషన్’ ఎన్నికల్లో గెలిచి..ఎదో భారత దేశానికీ ప్రధాన మంత్రి అయ్యిపోయాను అనే రేంజ్ ఫీల్ అయిపోతున్నాడు మంచు విష్ణు..వాస్తవానికి ఆయన నెటిజెన్స్ కి ఒక ట్రోల్ మెటీరియల్..ఇదంతా పక్కన పెడితే మంచు విష్ణు హీరో గా నటించిన ‘జిన్నా’ అనే సినిమా ఈ నెల 23 వ తారీఖున దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.

ఈ సినిమా గురించి మార్కెట్ లో అసలు ఎలాంటి చప్పుడు లేదు..మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాకి పోటీ గా దింపుదాం అని చిలిపి ప్రకటనలు చేసాడు మంచు విష్ణు..కానీ చిరంజీవి సినిమా ముందు మీకు థియేటర్స్ సర్దుబాటు చెయ్యలేం వేరే డేట్ కి వెళ్ళండి అనడం తో అక్టోబర్ 23 వ తారీకుకి జంప్ అయ్యాడు..ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా తన సినిమాకి బజ్ రావడం కోసం చిరంజీవి కుటుంబ సభ్యుల మీద ఆరోపణలే చేస్తున్నాడు..నాలుగు దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో ఉన్న కుటుంబానికి కూడా ఇలాంటి చీప్ పబ్లిసిటీ అవసరమా అని నెటిజెన్స్ పెదవి విరుస్తున్నారు.