IT Minister KTR To Visit US: తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా పరిశ్రమలు తరలివచ్చేందుకు కూడా సహకరిస్తోంది. దీంతో రాష్ర్టంలో మరిన్ని పరిశ్రమలు వచ్చేలా కృషి చేస్తోంది. దీనికి గాను అక్కడి ప్రతినిధుల్ని ఒప్పించేందుకు పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, అధికారుల బృందంతో అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ ఈనెల 29 వరకు తూర్పు, పశ్చిమ కోస్తా ప్రాంతాల్లో పర్యటించి వారితో సమావేశాలు నిర్వహించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తారు.
ఇప్పటికే అంతర్జాతీయ సంస్థలైన అమెజాన్, ఫేస్ బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్న తరుణంలో కేటీఆర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇవే కాకుండా ఫార్మా, ఆటోమొబైల్, టెక్స్ టైల్స్, బయో, లైఫ్ సైన్సెస్ లాంటి రంాలకు చెందిన సంస్థలు మన రాష్టానికి తరలి వస్తున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. వీటితోపాటు మరిన్ని సంస్థలు రాష్ట్రంలోకి వచ్చేందుకు ముందుకు రావడం శుభ పరిణామమే. దీంతో వాటితో చర్చలు జరిపేందుకు కేటీఆర్ అమెరికా వెళ్లనున్నారు.
Also Read: Telangana BJP: తెలంగాణ బీజేపీ సంచలనం.. కేసీఆర్ కు షాక్ తప్పదా?
తెలంగాణ సర్కారు పరిశ్రమ ఏర్పాటుతోనే ప్రగతి ముడిపడి ఉందని నమ్ముతూ వాటిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు శ్రమిస్తోంది. దీంతో మన ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించే అవకాశం ఏర్పడుతోంది. ప్రముఖ సంస్థలన్ని కూడా హైదరాబాద్ లో విస్తరించేందుకు సిద్ధంగా ఉండటం తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరిన్ని సంస్థలు కూడా తెలంగాణక వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకే మన పరిశ్రమలతో పెద్ద ఎత్తున నిరుద్యోగం కూడా కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ మంత్రి కేటీఆర్ పది రోజుల పాటు అమెరికాలో పర్యటించి పరిశ్రమల ఏర్పాటుకు దారులు తెరుస్తారని చెబుతున్నారు. ఇదే జరిగితే రాబోయే కాలంలో మరిన్ని సంస్థలు ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టి తమ సంస్థలు నెలకొల్పి వ్యాపారాన్ని విస్తరించేందుకు ముందుచూపుతో వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే హైదరాబాద్ కు మరిన్ని మంచి శకునాలే అని చెబుతున్నారు.
Also Read: Chinajiyar Swamy: కేసీఆర్ తో గ్యాప్.. సమ్మక్క-సారక్క వివాదంపై చినజీయర్ స్వామి హాట్ కామెంట్స్