Homeఎంటర్టైన్మెంట్OKTelugu MovieTime : టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్...

OKTelugu MovieTime : టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్

OKTelugu MovieTime : మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. పాన్​ ఇండియా స్టార్​ ప్రభాస్.. అనారోగ్య కారణాలతో స్పెయిన్​కు వెళ్లారు. అక్కడ శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది. చిన్నపాటి ఆపరేషన్​ అయినప్పటికీ డాక్టర్లు ప్రభాస్​ను పూర్తిగా విశ్రాంతి తీసుకోమని చెప్పినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న డార్లింగ్ ఫాన్స్.. తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కొన్ని నెలల క్రితం సలార్​ చిత్ర షూటింగ్​లో గాయపడ్డారు ప్రభాస్.

OKTelugu MovieTime
Prabhas

మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఏమిటంటే.. వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి ‘గని’ సినిమాను రూపొందించాడు. అయితే, ఈ సినిమా ఏప్రిల్ 8వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను చిత్రబృందం నిన్న రిలీజ్ చేసింది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానమైన సన్నివేశాలపై, దాదాపు ముఖ్య పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంది. ఈ సినిమాపై అంచనాలు పెంచింది. కాగా, చాలా వేగంగా ఈ ట్రైలర్ 6 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేయడం విశేషం.

Also Read: Tollywood Trends : టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్

Ghani
Ghani

ఇంకో అప్ డేట్ ఏమిటంటే.. మతవర్గ పోరు ఇక సినిమాలకు పాకింది. ఏది వాస్తవమో ఏది నిజమో కాస్త కల్పన జోడించి చూపాల్సిన సినిమా, వివాదాల పుట్టగా మారబోతోంది. కశ్మీరీ పండిట్‌లపై జరిగిన వాస్తవ మారణ హోమాన్ని ది కశ్మీరీ ఫైల్స్‌ వెలికి తీస్తే, మా తప్పుల్ని మీరు చూపెడితే మీ తప్పుల్ని మేము చూపిస్తాం అన్న చందంగా ఇప్పుడు గుజరాత్‌ ఫైల్స్‌ని తీసుకొస్తోంది రాణా ఆయుబ్‌. అయితే రాణా ఆయుబ్‌ రాసిన పుస్తకం ఊహాజనితం అని గతంలోనే కోర్టు తీర్పిచ్చింది.

The Kashmir Files
The Kashmir Files

ఇక మరో అప్ డేట్ ఏమిటంటే.. బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి వై కేటగిరీ భద్రతను కల్పించింది కేంద్ర ప్రభుత్వం. వాస్తవ ఘటనల ఆధారంగా ఆయన తీసిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమై, కొన్ని వర్గాల నుంచి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో ఆయన ఎక్కడకు వెళ్లినా.. సీఆర్​పీఎఫ్​ జవాన్లు వెంటే ఉంటారు. కాగా, మార్చి 11న విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లు సాధిస్తోంది.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ స్టైలే వేరు.. అప్పుడు బాడీగార్డ్.. ఇప్పుడు డిజిటల్ హెడ్

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version