BiggBoss OTT: బిగ్ బాస్ ఓటీటీ యమ రంజుగా సాగుతోంది. కేవలం గంట మాత్రమే చూసిన ప్రేక్షకులకు ఇప్పుడు 24 గంటలు సాగేసరికి ఆ మజాను ప్రతిక్షణం ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మనలాగానే బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్లు కూడా హోలీ జరుపుకున్నారు. అది ఈరోజు ప్రసారం కాబోతోంది. హోలీ రంగులు పూసుకున్న కంటెస్టెంట్ల మధ్య ప్రేమలు చిగురించాయి.తాజాగా విడుదల చేసిన ప్రోమో ఆకట్టుకుంటోంది.

హౌస్ లో అందరికంటే బాగా గేమ్ ఆడుతున్న ‘కూల్ రాణి’ బిందుమాధవిని లవ్ లో పడేయడం చాలా కష్టమని.. ఆమె చూపులతోనే ఎదుటువారు ఎలాంటి వాడో చెప్పిస్తుందని.. ఆమెను ముగ్గులోకి దించడం అయ్యే పని కాదంటూ తోటి మగ కంటెస్టెంట్ చెప్పడం ఆసక్తి కలిగేలా ఉంది. అతడి మాటలకు ఫిదా అయిన బిందుమాధవి గట్టిగా హగ్ చేసుకొని నవ్వులు చిందించింది.
Also Read: OKTelugu MovieTime : టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్
ఇక అమ్మాయిలను లవ్ లో పడేయాలంటే హోలీని మించిన పండుగ లేదని..అబ్బాయిలు అందరూ ట్రై చేయండని హీరోయిన్ తేజస్విని బిగ్ బాస్ లోని బాయ్స్ కు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది.
ఇక పోయిన బిగ్ బాస్ లో శ్రీరామచంద్రతో ప్రేమలో పడి అలరించిన హమీద ఈసారి ఓటీటీలో ఆ పనిని అఖిల్ తో చేసింది. వారిద్దరి మధ్య లవ్ కెమిస్ట్రీ మొదలైంది. చందమామను చూపిస్తూ ‘అలకరాజా’అఖిల్ వేసిన బిస్కట్లు అలరించాయి.ఇక హమీద కూడా మొహమాటానికి అఖిల్ తో కలిసి కాస్త రోమాన్స్ చేసింది.

చివర్లో యాంకర్ ఓంకార్ వచ్చి హోలీ సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లోని కంటెస్టెంట్లతో కలిసి ప్రేమ ఆటలు ఆడించాడు. ఎవరెవరు ఎవరితో కలిసి హౌస్ లో రోమాన్స్ చేస్తున్నారన్నది మరింత ఆకర్షణీయంగా వారితో ఆటలు ఆడించి చూపించాడు. మొత్తంగా ఈ హోలీ నాటి బిగ్ బాస్ డే చాలా ఆహ్లాదంగా సాగిందని అర్థమవుతోంది.
Also Read: Tollywood Trends : టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్
Recommended Video:
