దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో లాక్డౌన్ అమలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఏప్రిల్ 14తో ముగియనున్న లాక్డౌన్ ను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 30వరకు పొడగించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీటర్లో ఓ ఫొటోను షేర్ చేశారు. ఈ వారంలో తనకు ఎంతో నచ్చిన ఫొటో ఇదేనంటూ ట్వీట్ చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంతకీ ఈ ఫొటోలో ఏముందంటే.. ఓ దుకాణానికి వెళ్లిన ఐదుగురు చిన్నారులు సామాజిక దూరం పాటించడం కన్పిస్తుంది. దుకాణం ఎదురుగా గీసిన బాక్సుల్లో దూరంగా నిల్చొని ఈ చిన్నారులు సామాజిక దూరం పాటించడం అందరనీ ఆకట్టుకుంటుంది. చిన్నారులకు పెద్దలకు సామాజిక దూరంగా పాటించాలని చెబుతున్నారని దీనిని ప్రతీఒక్కరు అర్థం చేసుకోవాలని కేటీఆర్ కోరారు. అందరూ ఇంట్లో జాగ్రత్త ఉండాలని సూచించారు.
My favourite pic of the week 😊
Tiny tots teaching us adults the art of #Social_Distancing #StayHomeStaySafe #TelanganaFightsCorona pic.twitter.com/1G9psY95IH
— KTR (@KTRBRS) April 12, 2020
కాగా ప్రభుత్వం కరోనాపై ఎంత అవగాహన కల్పించినా కొందరు తరుచూ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. తాజాగా ప్రభుత్వం లాక్డౌన్ పొడగించడంతోపాటు నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది. రోడ్లపైకి వచ్చే వాహనాలు 3కిలోమీటర్ల కంటే ఎక్కువగా దూరంగా తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే ప్రభుత్వం మాస్కులను తప్పనిసరి చేసింది. బయటికి వెళ్లేవారు తప్పని ముఖానికి మాస్కులు ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేస్తే జైలు శిక్ష తప్పదని తాజాగా ఉత్వర్వులను విడుదల చేసింది. ప్రజలు ఈ నిబంధనలు పాటించి కరోనా వ్యాప్తి చెందకుండా చూడాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని ప్రభుత్వం చెబుతోంది.