https://oktelugu.com/

కొడుక్కి హీరో పేరు పెట్టుకున్న స్టార్ డైరెక్టర్

దర్శకుడు అనిల్ రావుపూడి తాజా చిత్రం ‘సరిలేరునీకెవ్వరు’. సూపర్ స్టార్ మహేష్ బాబు-అనిల్ రావుపూడి కాంబినేషన్లలో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్టయింది. మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా ‘సరిలేరునికెవ్వరు’ చిత్రం నిలిచింది. ఈ మూవీ ప్రీ రీలీజు వేడుక సందర్భంలోనే అనిల్ రావుపూడికి కుమారుడు పుట్టిన సంగతి తెల్సిందే. తాజాగా ఆయన కొడుక్కి పేరు పెట్టాడు. ‘సరిలేరునికేవ్వరు’లో మహేష్ పేరు అజయ్ కృష్ణ. ఈ పేరునే తన కొడుక్కి పెట్టినట్లు […]

Written By: , Updated On : April 12, 2020 / 05:50 PM IST
Follow us on


దర్శకుడు అనిల్ రావుపూడి తాజా చిత్రం ‘సరిలేరునీకెవ్వరు’. సూపర్ స్టార్ మహేష్ బాబు-అనిల్ రావుపూడి కాంబినేషన్లలో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్టయింది. మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా ‘సరిలేరునికెవ్వరు’ చిత్రం నిలిచింది. ఈ మూవీ ప్రీ రీలీజు వేడుక సందర్భంలోనే అనిల్ రావుపూడికి కుమారుడు పుట్టిన సంగతి తెల్సిందే. తాజాగా ఆయన కొడుక్కి పేరు పెట్టాడు. ‘సరిలేరునికేవ్వరు’లో మహేష్ పేరు అజయ్ కృష్ణ. ఈ పేరునే తన కొడుక్కి పెట్టినట్లు అనిల్ రావుపూడి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

‘సరిలేరునీకెవ్వరు’ మూవీలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా నటించారు. ఇందులో మహేష్ క్యారెక్టర్ పేరు అజయ్ కృష్ణ. ఈ పేరంటే ఇష్టంతోనే మహేష్ పాత్రకు ఆ పేరు పెట్టినట్లు చెప్పాడు. ఈ సినిమా విజయం గుర్తిండిపోయేలా తన కుమారుడి అజయ్ సూర్యన్ష్ అనే పెట్టినట్లు అనిల్ రావుపూడి చెప్పాడు. ఇక ‘సరిలేరునీకెవ్వరు’ ప్రీరిలీజ్ సందర్భంగా మెగాస్టార్-మహేష్-విజయశాంతి హంగామా ‘నెవ్వర్ బీఫోర్.. నెవ్వర్ ఆఫ్టర్’ లా సాగింది. ఈ సినిమా హిట్టు తర్వాత స్టార్ హీరోలంతా అనిల్ తో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్-3 చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడ్డారు. గతంలో విడుదలైన ‘ఎఫ్-2’ మూవీ సీక్వెల్ గా ‘ఎఫ్-3’ మూవీ రాబోతుంది. ఈ మూవీ స్ర్కీప్ట్ పనుల్లో అనిల్ బీజీగా ఉన్నాడు. ఇప్పటివరకు అనిల్ దర్శకత్వంలో వచ్చిన అన్ని మూవీలు సూపర్ హిట్టుగా నిలిచాయి. ‘ఎఫ్-2’లో నటించిన విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ఈ మూవీలో నటించనున్నారు. అయితే హీరోయిన్ల విషయంలో కొంత క్లారిటీ రావాల్సిందే. ఈ మూవీ ‘ఎఫ్-2’ తరహాలోనే ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’తో అద్భుతంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో వేచి చూడాల్సిందే..