https://oktelugu.com/

కులాలపై మోహన్ బాబు హాట్ కామెంట్

సినీ పరిశ్రమలో ముక్కుసూటి మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మోహన్ బాబేనని ప్రతీఒక్కరు చెబుతున్నారు. మనస్సులో ఏ విషయంలో దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు విషయం చెప్పేస్తారు. దాని వల్ల ఎవరు తనను నిందించినా.. ఎవరు బాధపడిన ఆయన పట్టించుకోరు. మొదటి నుంచి ఆయన నైజమే అలాంటిదని అందరూ సరిపెట్టుకుంటారు. తాజాగా ఆయన కులాలపై హాట్ కామెంట్ చేసి వార్తల్లో నిలిచారు. ప్రపంచంలో కరోనా ఎంట్రీతో పరిస్థితులన్నీ మారిపోయాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉన్నవి రెండు కులాలేనని. […]

Written By: , Updated On : April 12, 2020 / 07:20 PM IST
Follow us on


సినీ పరిశ్రమలో ముక్కుసూటి మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మోహన్ బాబేనని ప్రతీఒక్కరు చెబుతున్నారు. మనస్సులో ఏ విషయంలో దాచుకోకుండా కుండబద్దలు కొట్టినట్లు విషయం చెప్పేస్తారు. దాని వల్ల ఎవరు తనను నిందించినా.. ఎవరు బాధపడిన ఆయన పట్టించుకోరు. మొదటి నుంచి ఆయన నైజమే అలాంటిదని అందరూ సరిపెట్టుకుంటారు. తాజాగా ఆయన కులాలపై హాట్ కామెంట్ చేసి వార్తల్లో నిలిచారు.

ప్రపంచంలో కరోనా ఎంట్రీతో పరిస్థితులన్నీ మారిపోయాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉన్నవి రెండు కులాలేనని. అవి పాజిటివ్, నెజిటివ్ అని తనదైన శైలిలో వివరించారు మోహన్ బాబు. పదవీ అహంకారంతో ఉండే ఎవరైనా దీనిని అర్థం చేసుకుంటే చాలని జీవితాంతం గొప్పగా ఉంటారని చెప్పుకొచ్చారు. ఈ విషయం అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు కరోనా వచ్చిందని మోహన్ బాబు చెప్పారు.

‘ఎవరైనా బాంబ్ వేస్తే ఒక్కరోజులో చచ్చిపోతాం.. కానీ కరోనా విషయంలో మాత్రం ప్రతీక్షణం చస్తూ బ్రతుకుతున్నామని.. ఏ క్షణంలో ఎవరికి వస్తుందో ఏమిటో తెలియదని.. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎలా వస్తుందో తెలియదని చెప్పారు. కరోనా వైరస్ ‘తల్లి బిడ్డల మధ్య దూరం పెంచిందని.. భార్యాభర్తలను కూడా కలవకుండా చేస్తుందని.. ఇంతకంటే శిక్ష ఏముంటుంది.. ఇకనైనా ప్రతీఒక్కరూ మారాల్సిన సమయం వచ్చిందని’ మోహన్ బాబు తెలిపారు. ఆయన మాటలు ఆధ్యాత్మిక చింతనతో కూడినవిగా ఉండటంతో మోహన్ బాబు కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.