Minister KTR: బీజేపీని లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ రెచ్చిపోతోంది. అవకాశం దొరకితే అన్నింటిని వాడుకుంటున్నారు. పక్క రాష్ర్టమైనా ఫర్వాలేదు బీజేపీ అయితే చాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఏపీలో మంగళవారం బీజేపీ ప్రజాగ్రహ పేరుతో విజయవాడలో నిర్వహించిన సభలో బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడిన మాటలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై బదులిచ్చారు. బీజేపీ విధానాలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో మద్యనిషేధం అమలు చేస్తామని చెప్పిన వైసీపీ సర్కారు మద్యం ఏరులై పారిస్తున్నా ఎవరు మాట్లాడటం లేదు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చిన అది నెరవేరడం లేదు. దీంతో రాష్ర్టంలో పాలన అభాసుపాలవుతోంది. మద్యం తక్కువ ధరలకే అందజేస్తామని చెప్పడంతో బీజేపీ కూడా మద్యం విధానాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మద్య నిషేధం అమలు హామీగానే మిగిలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: కేటీఆర్ ఎక్కడున్నారు? నిజంగానే దుబాయ్ కు వెళ్లారా?
ఏపీలో మద్య నిషేధం అమలు కలగానే ఉండిపోతోంది. బీజేపీకి ఓటేస్తే మద్యం ప్రజలకు చౌకగా దొరుకుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మొత్తానికి బీజేపీని ఎండగట్టడమే ధ్యేయంగా టీఆర్ఎస్ చూస్తోంది. దీని కోసం ఏ అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఏపీలో మద్యం వ్యాపారం చేయాలని బీజేపీ చూస్తోందని విమర్శించారు.
రూ.50 లకే చీప్ లిక్కర్ అందజేసే విధానానికి బీజేపీ శ్రీకారం చుడుతోంది. ఇందుకోసమే ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందని చెబుుతున్నారు. బీజేపీ ఇస్తున్న ఆఫర్ ను ప్రజలు అందిపుచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని అంతటా ఎదుర్కొనేందుకే సిద్ధమవుతోంది. ఇప్పటికే కేంద్రంలో ప్రభుత్వాన్ని నిందించాలని చూస్తున్న టీఆర్ఎస్ ఇప్పుడు ఏపీ బీజేపీ శాఖను విమర్శిస్తూ ట్వీట్ చేస్తున్నారు.
Also Read: కాంగ్రెస్ కు నేతలే శాపమా?