Actress Laila: సీనియర్ సౌత్ హీరోయిన్ ‘లైలా’కి ఇటు తెలుగులో పాటు అటు తమిళంలో కూడా మంచి గుర్తింపు ఉంది. హోమ్లీ నెస్ కి కేరాఫ్ అడ్రస్ లా ఉండే లైలాకి ఇప్పటికీ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. రెండేళ్ల క్రితం మళ్ళీ యాక్టివ్ కావడానికి చాలా ప్రయత్నాలు చేసి విసిగిపోయింది. మధ్యలో కరోనాతో ఇక తన సినిమా ప్రయత్నాలను మానుకుంది. అయితే, మళ్ళీ లైలాలో సినిమా ఆశలు కలుగుతున్నాయి.

ఇక తనకు అవకాశాలు రావు అనుకున్న సమయంలో ఆమెకు ఒక బంపర్ తగిలింది. సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో లైలా నటించబోతుంది. త్రివిక్రమ్ ఆమె కోసం ఓ పర్ఫెక్ట్ పాత్ర రాశాడట. మహేష్ కి అక్కగా ఆమె సినిమాలో కనిపించబోతుందట. పైగా సినిమా ఓపెనింగ్ సీన్ లోనే ఆమె ఆత్మహత్య చేసుకుంటుందట.
సినిమాలో ఆమెది ఎమోషనల్ రోల్ అని, విలన్ అయిన భర్త పన్నిన ఉచ్చులో ఆమె బలి అవుతుందని, అయితే, ఆ తర్వాత తన అక్క చావుకి కారణం అయిన వారి పై మహేష్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ సీక్వెన్స్ అట. అలా ఆడవాళ్ళ పై జరుగుతున్న దారుణాలకు ఓ ముగింపు చెప్పాలనే కోణంలో ఈ సినిమా సాగుతుందట.
Also Read: ‘మహేష్ సినిమా’ పై ఓపెన్ అయిన రాజమౌళి !
మొత్తానికి లైలాకి అయితే, ఓ మంచి అవకాశం వచ్చింది. అందుకే ఆమె మళ్ళీ సినిమాల పై ఫోకస్ పెట్టింది ప్రస్తుతం అవకాశాలు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా తెగ హడావిడి చేస్తోంది. ఇప్పటికీ తనలో ఉత్సాహం ఉందని, తనకు నటన పై తపన ఉందని డైరెక్ట్ గానే డైరెక్టర్లకు ఆమె మెసేజ్ లు పాస్ చేస్తోందట.
మరి ఆమెకు ఛాన్స్ లు వస్తాయేమో చూడాలి. అప్పట్లో స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. హీరోయిన్ గా తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి క్రేజ్ సంపాదించింది. కానీ పెళ్లి తర్వాత 16 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. చాలా గ్యాప్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్లీ ఎంట్రీ ఇవ్వబోతుంది.
Also Read: ఈ ఫొటోలోని చిన్నారిని గుర్తు పట్టారా.. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిందంటే?