List Of Highest Grossing Films: కరోనా మహమ్మారి వలన ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీకి తీవ్రమైన నష్టం కలిగిన సంగతి అందరికీ విదితమే. కాగా, 2021 ద్వితీయార్థంలో సినిమా ఇండస్ట్రీ కోలుకుంటున్న పరిస్థితులు అయితే కనబడ్డాయి. ఇక వచ్చే ఏడాది పెద్ద సినిమాల పండుగే ఉండబోతున్నది. కాగా, ఈ ఏడాది కూడా సినిమా ఇండస్ట్రీకి మేలు జరిగిందని సినీ పరిశీలకులు చెప్తున్నారు. ఈ ఏడాది విడుదలైన అర డజను మూవీస్ ప్రతీ రోజు రూ.కోటికి పైగా షేర్ వసూలు చేసి రికార్డు క్రియేట్ చేశాయి.

ఆ సినిమాల కలెక్షన్స్ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి మళ్లీ కొంత ఉత్తేజం వచ్చిందని చెప్పొచ్చు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ నుంచి మొదలై ఇటీవల విడుదలైన ‘పుష్ప’ వరకు ఈ చిత్రాలకు విడుదలైన పది రోజుల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా పిక్చర్ ‘పుష్ప’ ఇటీవల విడుదలై దూసుకుపోతున్నది. ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఉభయ తెలుగు రాష్ట్రాలలో కాస్త తక్కువ వసూళ్లే వచ్చాయి. తొలి రోజు రూ.24.90 కోట్ల షేర్ వసూలు కాగా, పదకొండో రోజు రూ.1.05 కోట్లు వసూలు అయ్యాయి. కాగా పన్నెండో రోజు రూ.69 లక్షలకు వసూళ్లు పడిపోయాయి.
Also Read: చరణ్ రిక్వెస్ట్.. శంకర్ కి పోస్ట్ ఫోన్ తప్పలేదు !
నందమూరి నటసింహం బాలయ్య, యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘అఖండ’ ఫిల్మ్‌కుగాను పదకొండు రోజుల పాటు రూ.కోటికి పైగా వసూళ్లు వచ్చాయి. ఫస్ట్ డే నుంచి ఈ ఫిల్మ్ సంచలన వసూళ్లు సాధిస్తూ ముందుకు సాగింది. ఈ సినిమా పన్నెండో రోజున ఉభయ తెలుగు రాష్ట్రాలలో రూ.85 లక్షల షేర్ వసూలు అయింది.
మూడేళ్ల సినీ ‘అజ్ఞాతవాసం’ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ గా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చాడు. కొవిడ్ మహమ్మారి టైంలోనే ఈ పిక్చర్ రిలీజ్ అయినప్పటికీ హయ్యెస్ట్ షేర్ కలెక్ట్ చేసింది. రూ.85 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. వరుసగా పది రోజుల పాటు ‘వకీల్ సాబ్’ సినిమాకుగాను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రూ.కోటికి పైగా వసూళ్లు వచ్చాయి.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘ఉప్పెన’ చిత్రం.. అంచనాలను అందుకుని సక్సెస్ అయింది. ఈ సినిమా పదకొండు రోజుల పాటు ప్రతీ రోజు రూ.కోటికి పైగా వసూలు చేసింది. ఫుల్ రన్‌లో ఈ మూవీకి రూ.51 కోట్ల షేర్ వచ్చింది. నవీన్ పొలిశెట్టి హీరోగా వచ్చిన ‘జాతిరత్నాలు’ చిత్రం పదమూడు రోజుల పాటు ప్రతీ రోజు రూ.కోటి కంటే ఎక్కువ వసూలు చేసింది. అనుదీప్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బెస్ట్ ఎంటర్ టైనర్‌గా నిలిచింది. మాస్ మహారాజా రవితేజ పోలీస్ ఆఫీసర్ రోల్ ప్లే చేసిన ‘క్రాక్’ ఫిల్మ్ కూడా వరుసగా పదకొండు రోజుల పాటు రూ.కోటి కంటే ఎక్కువ షేర్ వసూలు చేసింది.
Also Read: ఎన్టీఆర్ – చరణ్ మధ్య ఫైట్.. ఆర్ఆర్ఆర్ పై లేటెస్ట్ అప్ డేట్ !