తనను క్షమించాలని కోరిన కేటీఆర్!

ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ జలుబుతో బాధపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ విషయం పై కొందరు నెటిజన్లు ఆందోళన చెందడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను కొన్నేళ్లుగా జలుబుతో కూడిన అలర్జీతో బాధపడుతున్నానని… ఇటీవల సిరిసిల్ల పర్యటన సందర్భంగా అలాంటి జలుబు కారణంగానే కొంత ఇబ్బందిపడ్డానని ఆయన వివరించారు. అయితే హఠాత్తుగా తన పర్యటన రద్దు చేసుకుంటే… కొందరు ఇబ్బందిపడతారనే కారణంగానే జలుబుతోనే సిరిసిల్ల జిల్లాలో పర్యటించానని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. […]

Written By: Neelambaram, Updated On : May 12, 2020 3:30 pm
Follow us on

ఇటీవల తెలంగాణ మంత్రి కేటీఆర్ జలుబుతో బాధపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ విషయం పై కొందరు నెటిజన్లు ఆందోళన చెందడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను కొన్నేళ్లుగా జలుబుతో కూడిన అలర్జీతో బాధపడుతున్నానని… ఇటీవల సిరిసిల్ల పర్యటన సందర్భంగా అలాంటి జలుబు కారణంగానే కొంత ఇబ్బందిపడ్డానని ఆయన వివరించారు. అయితే హఠాత్తుగా తన పర్యటన రద్దు చేసుకుంటే… కొందరు ఇబ్బందిపడతారనే కారణంగానే జలుబుతోనే సిరిసిల్ల జిల్లాలో పర్యటించానని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. దీని వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమించాలని కేటీఆర్ ట్విట్టర్‌ లో కామెంట్ చేశారు.

దీంతో కొందరు నెటిజన్లు ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. కోవిడ్ 19పై జరుగుతున్న పోరులో మీరు ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారని… మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ అనేక మంది ట్విట్ చేశారు. వారి ట్వీట్స్‌కు సంబంధించిన మంత్రి కేటీఆర్… దీనిపై వివరణ ఇచ్చారు.