
సహజంగా ఇష్టమైన హీరో హెయిర్ స్టైల్ ని అభిమానులు చేయించుకుంటూ వారి అభిమానాన్ని చాటుకుంటారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు కూడా ఏమి అర్థంకాక కరోనా మహమ్మారి హెయిర్ స్టైల్ చేయించుకుంటారు. ఇది పిచ్చో, పైత్యమో లేక కరోనా అంటే వికారమో.. తెలియదు గానీ కొందరు కోవిద్19 హెయిర్ స్టైల్ చేయించుకోవడం గమనార్హం.
ఈ విషయంలో ఆఫ్రికన్లకు ఎవరూ పోటీ ఇవ్వలేరు. వారు ఎప్పుడు తమ జుట్టును డిఫరెంట్ లుక్ తో చూపించాలనుకుంటారు. నేను ట్రెండ్ ను ఫాలో అవ్వను ట్రెండ్ సెట్ చేస్తాను అన్న ఓ సినిమా డైలాగ్ లా కొత్తరకం హెయిర్ స్టయిల్స్ ఎక్కువగా వారినుండే వస్తాయి. ప్రస్తుతం కరోనా ను చూసి ప్రపంచం వణికి పోతుంటే ఆఫ్రికన్లు మాత్రం దాన్ని హెయిర్ స్టైల్ గా మార్చి నెత్తి మీద పెట్టుకున్నారు. దానికోసం జుట్టును కొమ్ములు గా మలచి జుట్టు వేసుకున్నారు. అయితే కరోనా హెయిర్ స్టైల్ వెనక ఓ బలమైన కారణం కూడా ఉందని ఆఫ్రికన్స్ చెబుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో హెయిర్ స్టైల్ తో కరోనా పై అవగాహన కల్పిస్తున్నామని అంటున్నారు. ఇలా చేయడం వల్ల ఈ వైరస్ ఎంత భయంకరమైనదో ప్రజలు సులువుగా అర్థం చేసుకుంటారని చెబుతున్నారు.