https://oktelugu.com/

హైదరాబాద్ లో అదుపు తప్పిన కరోనా.. ఆందోళనలో అధికారులు

హైదరాబాద్ జిల్లాను కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించినా లెక్క చేయకుండా రాజకీయ వత్తిడిల కారణంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కరోనా కరోనా టెస్ట్ లను తగ్గించడమే కాకుండా, మద్యం షాపులను తీర్చుకోవడానికి అనుమతించడం, పలు సడలింపులు ఇవ్వడంతో తిరిగి హైదరాబాద్ నగరంలో కరోనా ఉధృతంగా వ్యాపిస్తుంది. ఇంతకాలం చేసిన కృషి వృధా అవుతున్నదా అనే అనుమానాలు అధికారులకు కలుగుతున్నాయి. కరోనా అదుపు తప్పుతున్నదా అని భయపడుతున్నారు. హైదరాబాద్‌ను కరోనా మహమ్మారి హడలెత్తిస్తోందిని ఇప్పుడు కేసీఆర్ కు […]

Written By: , Updated On : May 12, 2020 / 03:14 PM IST
Follow us on

హైదరాబాద్ జిల్లాను కేంద్ర ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించినా లెక్క చేయకుండా రాజకీయ వత్తిడిల కారణంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కరోనా కరోనా టెస్ట్ లను తగ్గించడమే కాకుండా, మద్యం షాపులను తీర్చుకోవడానికి అనుమతించడం, పలు సడలింపులు ఇవ్వడంతో తిరిగి హైదరాబాద్ నగరంలో కరోనా ఉధృతంగా వ్యాపిస్తుంది.

ఇంతకాలం చేసిన కృషి వృధా అవుతున్నదా అనే అనుమానాలు అధికారులకు కలుగుతున్నాయి. కరోనా అదుపు తప్పుతున్నదా అని భయపడుతున్నారు. హైదరాబాద్‌ను కరోనా మహమ్మారి హడలెత్తిస్తోందిని ఇప్పుడు కేసీఆర్ కు సహితం కలవరం కలిగిస్తున్నట్లు కనిపిస్తున్నది.

ప్రధాని మోదీ జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌తో పాటు చాలా నగరాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందని కేసీఆర్ పేర్కొనడం గమనార్హం. హైదరాబాద్‌లో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.

తెలంగాణలో సోమవారం ఒక్కరోజే కొత్తగా 79 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా అవ్వన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే కావడంతో అధికార వర్గాలు ఖంగారు పడుతున్నాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,275కు చేరింది.

రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ జిల్లాల్లో పాజిటివ్‌ కేసుల నమోదు తగ్గుతున్నప్పటికీ హైదరాబాద్‌లో మాత్రం ఆందోళనకరస్థాయిలో పెరుగుతున్నాయి. ఏప్రిల్‌ 21న తెలంగాణలో 56 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత అత్యధికంగా సోమవారం 79 కేసులు పాజిటివ్‌ వచ్చాయి. మొత్తం కేసుల్లో 60 శాతం హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి.

ఏప్రిల్‌21 నుంచి మే 10 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 392 కేసులు నమోదయితే అందులో 312కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనివే. అందులో 222 కేసులు గత పది రోజుల్లో (మే నెలలో) నమోదైనవే. శనివారం (మే 9న) నమోదైన 31 కేసుల్లో 30.. ఆదివారంనాటి 33 కేసుల్లో 26, సోమవారం నాటి మొత్తం 79 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనివేనంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

కార్వాన్‌ నియోజకవర్గంలోని జియాగూడ డివిజన్‌లో సోమవారం ఒక్కరోజే 25 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదే ప్రాంతంలో ఒక్క మున్సిపల్‌ డివిజన్‌ పరిధిలో ఇప్పటి వరకు 68 కేసులు నమోదు కాగా అందులో ఆరుగురు వైర్‌సతో మృతి చెందారు. 15 రోజుల వ్యవధిలో 70 వరకు కేసులు నమోదవడంతో ఇక్కడ నివసిస్తున్న