
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. దుబ్బాక ఉప పోరు ఏమో కానీ.. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ‘నువ్వెంత అంటే.. నువ్వెంత’ అన్నట్లు బలనిరూపణ చేసుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ అయితే బీజేపీని టార్గెట్ చేసి ఏకంగా ప్రధాని మీదనే ఫైర్ అయ్యారు. నిన్న మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ ఒకప్పుడు టీడీపీ.. ఇప్పుడు కాంగ్రెస్.. రేపోమాపో బీజేపీలో చేరుతాడంటూ జోస్యం చెప్పారు. రేవంత్‌ను ప్రజలు ఎవరూ పట్టించుకోవడం లేదంటూ చెప్పుకొచ్చారు. అసలు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ తన దృష్టిలో లీడరే కాదని సంచలన వ్యాఖ్యలే చేశారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
రేవంత్ అంతటి నాయకుడే కేటీఆర్ దృష్టిలో లీడర్ కానప్పుడు మరి ఆయన దృష్టిలో ఆ హోదా ఎవరికి ఉన్నట్లు..? తెలంగాణ రాష్ట్రంలో ఒక కేసీఆర్, కేటీఆర్ మాత్రమేనా లీడరంటే..? అదేనా కేటీఆర్ అభిప్రాయం కూడా..! ప్రభుత్వాన్ని నిలదీసే ఏ నాయకుడు కూడా లీడర్ కాదా..? ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయకుండా సైలెంట్‌గా ఉండిపోతేనే లీడర్ అవుతాడా..? ఈ ప్రశ్నలే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి ఒకప్పుడు టీడీపీలో ఉన్న కేసీఆర్ తర్వాత తెలంగాణరాష్ట్ర సమితిని స్థాపించారు. అంటే ఆయన కూడా ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారినట్లే కదా..! ఈ విషయం కేటీఆర్‌కు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
Also Read: దుబ్బాక ఉపఎన్నికపై కేసీఆర్ సంచలన కామెంట్స్
ముఖ్యంగా తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. రైతు రుణ మాఫీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. ఇప్పటివరకు 27 వేల కోట్ల పైచిలుకు రుణమాఫీ అందించామని చెప్పారు. తమ పార్టీకి రైతుల పట్ల ఉన్న కమిట్‌మెంట్ అలాంటిదని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు మొత్తంగా 56 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.
Also Read: రైతులకు కేసీఆర్ శుభవార్త.. రైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారు!
ఇప్పుడు తెలంగాణ తలసరి ఆదాయం డబుల్ అయిందని, మంచిని మంచి… చెడును చెడు అని చూపెట్టేలా మీడియా ప్రయత్నం చేయాలని కోరారు. రాహుల్ గాంధీ 2 లక్షల రైతు రుణమాఫీ అని చెప్పినా ప్రజలు నమ్మలేదన్నారు. విపక్షాలు ఇప్పుడైనా ఆర్బీఐ రిపోర్ట్ తెలుసుకోవాలని హితవు పలికారు.
Comments are closed.