అడ్డంగా బుక్కయిన కేటీఆర్…! అలా మాట్లాడి ఉండకూడదు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రివర్యులు అయిన కేటీఆర్…. రాష్ట్ర ప్రజలతో, తన ఫ్యాన్స్ తో తరచుగా ముచ్చటిస్తూ ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సకాలంలో స్పందించడం…. ఇక పాలనాపరంగా ప్రజల నుండి వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున వివరణ ఇవ్వడం కేటీఆర్ కు అలవాటు. అయితే ఇప్పుడు కరోనా నివారణ చర్యల్లో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ లో కొద్ది […]

Written By: Kusuma Aggunna, Updated On : August 9, 2020 7:04 pm
Follow us on

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రివర్యులు అయిన కేటీఆర్…. రాష్ట్ర ప్రజలతో, తన ఫ్యాన్స్ తో తరచుగా ముచ్చటిస్తూ ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సకాలంలో స్పందించడం…. ఇక పాలనాపరంగా ప్రజల నుండి వస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున వివరణ ఇవ్వడం కేటీఆర్ కు అలవాటు. అయితే ఇప్పుడు కరోనా నివారణ చర్యల్లో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ లో కొద్ది సేపటి క్రితమే లైవ్ సెషన్ ను నిర్వహించారు. అయితే అందులో కేటీఆర్ కు ఊహించని ప్రశ్నలను రాష్ట్ర ప్రజలకు సంధించడం ఆయనకు బాగా ఇబ్బందికరంగా మారింది.

 

ముందుగా ఒక ట్విట్టర్ యూజర్ ఎంతో వివాదాస్పదంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి అందరు ఏమి అనుకుంటున్నారు అంటే కృష్ణ నీటి జిల్లాల్లో తమకు రావాల్సిన వాటా ఉందని…. ఎటువంటి మిత్రత్వాన్ని ఇందులో లెక్కచేయమని…. ఇప్పటికే ఈ విషయమై సుప్రీం కోర్టు వరకు వెళ్ళామని…. తమకు రావాల్సిన నీటిని ఎలాంటి పరిస్థితుల్లో వదులుకోమమని కేటీఆర్ అన్నారు. అయితే ఈ మాటలతో జగన్ తో ఉన్న మిత్రుత్వం ఇంతటితో చెడిపోయిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వైసిపి కార్యకర్తలకు కూడా ఈ మాటలు పెద్దగా రుచించలేదు. అలాగే కరోనా నివారణ చర్యల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చూపిస్తున్న జాప్యాన్ని కేటీఆర్ సమర్థిస్తున్నట్లు కనిపించింది.

కరోనా వ్యాధి నివారణ చర్యల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం వహిస్తున్న అలసత్వం గురించి హెల్త్ బులిటెన్ వివరాలు సరిగ్గా అప్డేట్ చేయట్లేదు అని కొంతమంది ప్రశ్నించగా కేటీఆర్ తడబడ్డాడు. ఒక్కో రాష్ట్రానికి నివారణ చర్యల్లో ఒక్కో శైలి ఉంటుందని…. డబ్ల్యూహెచ్ఓ, ఐసీఎంఆర్ మార్గనిర్దేశకాలనే తాము అనుసరిస్తున్నామని చెప్పిన కేటీఆర్ ను…. అతి తక్కువ టెస్టులు జరపమని ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్ఓ నిబంధనల్లో అంటూ కొంతమంది ప్రశ్నించారు.

వాటికి కేటీఆర్ నుండి ఎటువంటి సమాధానం లేకపోవడం గమనార్హం. అలాగే గాంధీ ఆసుపత్రి నుండి ఎన్నో వేలమంది పేషెంట్లు కోలుకుని తిరిగి వెళ్ళారు అని చెప్పిన కేసీఆర్…. అలాగే ఆయన ఎమ్మెల్యేలు, మంత్రులు గాంధీ ఆస్పత్రిలో, ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకుండా ప్రైవేటు ఆస్పత్రిలో ఎందుకు చికిత్స చేయించుకుంటున్నారు అని తెలంగాణ ప్రజలు అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వలేకపోయాడు. గతంలో ఎంతో నిక్కచ్చిగా, స్పష్టంగా…. నిజాయితీగా మాట్లాడే కేటీఆర్ ఈసారి మాత్రం ప్రభుత్వ వైఫల్యాన్ని వెనకేసుకొస్తూ బాగా ఇబ్బంది పడ్డాడు.