రాష్ట్రంలో మూడు రాజధానుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు సిద్ధమైన వైసీపీ ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ ఇందుకు ముహూర్తంగా నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వనించేందుకు అపాయింట్మెంట్ కోసం సిఎంఓ కార్యలయం ప్రయత్నం చేస్తుంది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించినంత మాత్రాన ప్రధాని ఈ కార్యక్రమానికి హాజరవుతారా అనే సందేహం ఇప్పడు అందరికీ కలుగుతుంది. రాజధాని విషయంలో చట్ట పరంగా, న్యాయస్థానాల్లోను వివాదాలు కోనసాగుతుండటం, అమరావతి రైతులు, ప్రజలు రాజధాని తరలింపునకు వ్యతిరేకంగా 235 రోజులుగా నిరసనలు తెలియజేస్తున్నారు. దీంతో ఇది ఒక వివాదాస్పద అంశంగా మారింది.
Also Read: అదే జరిగి ఉంటే విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో ఎంతో మంది బ్రతికేవారు..!
ఇటువంటి వివాదాస్పద కార్యక్రమానికి ఆహ్వానం ఉన్నంత మాత్రాన ప్రధాని నరేంద్ర మోడీ ఎలా హాజరవుతారనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. మరోవైపు టిడిపి ప్రభుత్వ హయాంలో 2015 అక్టోబరు 22వ తేదీన ప్రధాని మోడీ, సిఎం చంద్రబాబు రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు. ఇప్పడు మరో రాజధానికి శంకుస్థాపన చేసేందుకు మోడీ ఏ ముఖం పెట్టుకుని వస్తారని రాజధాని వాసులు విమర్శిస్తున్నారు. మూడు రాజధానుల నిర్మాణానికి ప్రభుత్వ పెద్దలు ఎన్ని కారణాలు చెప్పినా దీని వెనుక ఉన్నది రాజకీయ అంశం అనేది అందరకీ తెలిసిన విషయమే.
మరోవైపు పునర్విభజన చట్టంలో రాష్ట్రానికి ఒక రాజధానినే పేర్కోన్నారని, మూడు రాజధానులు నిర్మాణం ఈ చట్టానికి వ్యతిరేకం అని న్యాయ నిపుణులు కొందరు చెబుతున్నారు. మరి చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న మూడు రాజధానుల శంకుస్థాపనకు ప్రధాని హాజరైతే చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించినట్లే అవుతుంది. అటువంటి పని ప్రధాని మోడీ చేస్తారా అనే సందేహం కలుగుతుంది.
ఇప్పటికే అమరావతి విషయంలో రెండు నాల్కల దోరణితో వ్యవహరిస్తుందని బీజేపీ విమర్శలు ఎదుర్కొంటుంది. మొన్నటి వరకూ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ రాజధాని విషయంలో అమరావతికే తమ పూర్తి మద్దతు ప్రకటించారు. తాజాగా నియమితులైన బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇందుకు విరుద్ధంగా అమరావతి రైతులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామంటున్నారు. మూడు రాజధానుల విషయంలో అన్ని పార్టీలు ఆలోచన చేయాలని ప్రకటించారు. దీంతో అమరావతి విషయంలో పూర్తిగా రాజకీయ వైఫల్యం చెందిన పార్టీగా రాష్ట్రంలో బీజేపీ మిగిలిపోయింది.
Also Read: దూకుడు భేష్… మరి దూరదృష్టి ఎక్కడ జగన్ ?
ఇటువంటి పరిస్థితుల్లో మూడు రాజధానుల శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరైతే తీవ్ర స్థాయిలో విమర్శలు మూట గట్టుకోక తప్పదు. 2015లో ప్రత్యేక హోదా డిమాండ్ ముమ్మరంగా ఉన్న సమయంలో అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మోడీ ఢిల్లీలోని పార్లమెంట్ నుంచి మట్టి, యమునా నది నుంచి నీళ్లు తెచ్చి చంద్రబాబుకు ఇచ్చారు. హోదా విషయంలో మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో అప్పట్టో ప్రధాని తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ఇప్పడు మరోమారు రాజధాని శంకుస్థాపనకు వస్తే మునుపటికంటే ఎక్కువ విమర్శలు మూటగట్టుకోక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.