KTR Birthday Wishes To KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ కు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆయన రాష్ట్రాన్ని నడిపించాలని ఆకాంక్షిస్తున్నారు. పట్టుదల, క్రమశిక్షణ, అకుంఠిత దీక్ష, అన్నింట్లో కేసీఆర్ కు మంచి దక్షత ఉంది. అందుకే ఆయన రాష్ట్రాన్ని రెండు సార్లు పాలించే అవకాశం దక్కించుకున్నారు. అధికారంలో లేకపోయినా పద్నాలుగేళ్లు పార్టీని నడిపించడమంటే మాటలు కాదు. అలాంటి మహా ఉద్యమాన్ని నడిపిన వ్యక్తిగా కేసీఆర్ కు మంచి పేరుంది.
కేసీఆర్ లో ఉన్న దీక్షతోనే ఆయన అన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. మధ్య తరగతి నుంచి సీఎం గా ఎదిగే క్రమంలో ఆయన ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్నో వేదనలు అనుభవించారు. అయినా వెనుకంజ వేయలేదు. అధికారం దక్కే వరకు విశ్రమించలేదు. అందుకే ఆయనను అందరు మార్గదర్శకంగా భావిస్తారు. ఆయన ఉద్దేశాలను గౌరవిస్తారు.
Also Read: CM KCR Birthday: కేసీఆర్ బర్త్ డే స్పెషల్: 68వ వసంతంలోకి టీఆర్ఎస్ బాస్
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షల పరంపర కొనసాగుతోంది. ఎందరో ప్రముఖులు తమ సందేశాలు పంపించారు. దానికి ఆయన కూడా సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ సైతం తన మనసులోని మాటను బయటపెట్టారు. తన తండ్రి అంటే తనకు గౌరవం అని అన్నారు. రాష్ట్రానికి సీఎం అయినా ఎక్కడ కూడా పొంగకుండ ఎంత ఎదిగినా ఒదిగే మనస్తత్వం అంటే నాకు ఎంతో ఇష్టమని ట్వీట్ చేశారు.
మరో వైపు కూతురు కవిత కూడా తన తండ్రిపై భక్తిని చాటుకున్నారు. తన తండ్రి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. తనకు మార్గదర్శనం చేసేది ఆయనే అని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని పాలించే తన తండ్రికి కూతురుగా జన్మించడం తనకు ఓ వరమని చెప్పారు. భవిష్యత్తులో తన తండ్రి మరోమారు అధికారంలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: KCR Politics: తెలంగాణలో ‘ముందస్తు ఎన్నికల’ ఊహాగానాలు!? కేసీఆర్ లొల్లికి కారణమదే?