CM Jagan: మన దేశంలో రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నియామకం అయిన ఆఫీసర్లను అధికారం రాగానే మార్చేయడం చాలా కామన్. ఇప్పుడు జగన్ కూడా వరుసగా ఇదే పనిలో పడ్డారు. ఆయన సీఎం అయ్యాక నాలుగు డిపార్టుమెంట్లతో తలనొప్పులు వచ్చాయి. ఏపీఎస్ఈసీ, ఏపీపీఎస్సీ తో పాటుగా వక్ఫ్ బోర్డు, శాసనమండలి జగన్‌కు ప్రతి విషయంలో షాక్ ఇవ్వసాగాయి. దీంతో వాటిని తన గుప్పిట్లోకి తీసుకుంటున్నారు జగన్.
గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నిమ్మగడ్డ రమేశ్‌కు, జగన్‌కు పెద్ద పోరే నడిచింది. అయితే ఆయన రిటైర్ అయ్యాక జగన్ ఆ ప్లేస్ లో నీలం సాహ్నిని నియమించుకుని ఆ వ్యవస్థను తన గుప్పిట్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత మూడు రాజధానుల బిల్లు విషయంలో మండలి నుంచి ఎదురు దెబ్బ తగిలింది. అప్పటి టీడీపీ నేత, మండలి ఛైర్మన్ అయిన షరీఫ్ తో పాటు టీడీపీ ఎమ్మెల్సీలు ఈ బిల్లును అడ్డుకున్నారు. దీంతో ఏకంగా మండలినే రద్దు చేసేందుకు రెడీ అయిపోయారు. ఈ మేరకు శాసన సభలో తీర్మానం కూడా చేశారు.
అయితే ఈ బిల్లు పెండింగ్ లో ఉండగానే.. మండలిలో వైసీపీకి మెజార్టీ రావడంతో.. ఆ సమస్య నుంచి బయట పడ్డారు జగన్. ఇప్పుడు ఏపీపీఎస్సీ మీద గురి పెట్టారు. ఇంతకు ముందు దీనికి చైర్మన్ గా ఉన్న ఉదయ్ భాస్కర్ జగన్‌కు సహకరించట్లేదని.. ఆయన్ను నామ మాత్రానికి పరిమితం చేస్తూ.. కొత్తగా కార్యదర్శిని నియమించి పగ్గాలు మొత్తం అతనికే అప్పటించారు. అలా ఆ డిపార్టుమెంటును కొంత తన చేతిలో పెట్టుకున్న జగన్.. ఇప్పుడు మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించి పూర్తి స్థాయిలో దాని మీద పట్టు సాధించారు.
Also Read: CM Jagan- Gowtham Sawang: గౌతమ్ సవాంగ్‌కు కీలక పదవి.. జగన్ అసలు వ్యూహం ఇదే..!
వాస్తవానికి ఈ మూడు వ్యవస్థల్లో గతంలో చంద్రబాబు హయాంలో ఉన్న వారే ఉండటం వల్ల.. వారితో జగన్ కు విభేదాలు వచ్చాయి. తాను తీసుకున్న నిర్ణయాలను విభేదించడంతో జగన్.. ఏకంగా వారినే మార్చేసే ప్రయత్నంలో ఒక్కొక్కటిగా సక్సెస్ అవుతూ వస్తున్నారు. కాగా ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఒక్కటి మిగిలిపోయింది. ఇక ఇందులో ఉన్న బోర్డ్ సభ్యులు ఎప్పుడో నియమించిన వారు కావడంతో.. వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తున్నారు జగన్. ఇందుకోసం ఇప్పటికే పావులు కదుపుతున్నారు జగన్. నటుడు అలీకి వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ పగ్గాలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు జగన్. అదే జరిగితే.. ఆ డిపార్టుమెంట్ కూడా జగన్ చేతిల్లోకి వచ్చేసినట్టే. ఇలా తనకు సవాళ్లు విసిరిన వ్యవస్థలన్నింటినీ చివరకు తన గుప్పిట్లోకి తీసుకుంటున్నారు జగన్.
Also Read: Vasantha Krishna Prasad-Jagan: జగన్ కొట్టలేదట.. నమ్మండి అంటున్నాడు..