Why Ash Color Is In White: ఇలాంటిది విన్నప్పుడు అసలు అదేమిటి ? అని తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలైతే బాగా ఉత్సాహం చూపిస్తారు. పైగా ఆసక్తిని కలిగిస్తూ విజ్ఙాణాన్ని అందించే వార్త అయితే.. మరింత ఆసక్తిని కనబరుస్తారు . ఇంతకీ.. నల్లగా ఉండి.. కాలిన తర్వాత తెల్లగా మారేది ఏమిటో తెలుసా…? బొగ్గు.

అవును, బొగ్గు నల్లగా ఉంటుంది. కానీ బొగ్గు కాలితే వచ్చే బూడిద మాత్రం తెల్లగా ఉంటుంది. ఎందుకో తెలుసా ?
బొగ్గులో కార్బన్ కణాలు ఎక్కువగా ఉంటాయి. సహజంగా కార్బన్ కణాలు రంగు నలుపు. అయితే, బొగ్గును కాల్చినపుడు.. ఆ కార్బన్ గాలిలోని ఆక్సిజన్‌తో కలిసిపోతుంది. అప్పుడు అది కార్బన్ డై ఆక్సైడ్ గా రూపాంతరం చెందుతుంది. పైగా బొగ్గులో నల్లని రంగులో ఉండే కార్బన్ కణాలతో పాటు కార్బన్, హైడ్రోజన్ కలిసి ఉండే హైడ్రోకార్బన్ సమ్మేళనాలు, పొటాషియం, కాల్షియం అల్యూమినియం వంటి ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
Also Read: కర్నూలు జనసేన ఆఫీసుకు తాళం.. అన్నంత పని చేసిన వైసీపీ నేతలు
అయితే, బొగ్గును కాల్చే సమయంలో కార్బన్ డై ఆక్సైడ్ ఏర్పడుతుంది. దాని కారణంగా అందులోని హైడ్రోకార్బన్లు, హైడ్రోజన్, కార్బన్ లుగా విడిపోతాయి. అంతటితో ఆగవు అండోయ్.. కార్బనేమో ఆక్సిజన్‌తో కలిసిపోయి కార్బన్‌డై ఆక్సైడ్ వాయువుగా మారుతుంది. ఇక హైడ్రోజనేమో ఆక్సిజన్‌తో కలిసిపోయి నీటి ఆవిరిగా మారిపోతుంది.

ఇక మిగిలిపోయిన ఖనిజ లవణాలలోని ఖనిజాలు.. ఆక్సిజన్‌తో బాగా కలిసిపోయి.. ఖనిజ ఆక్సైడ్లుగా మారుతుంది. మొత్తమ్మీద ఈ ఆక్సైడ్‌లు ఉష్ణం వల్లే.. కాలిపోయిన బొగ్గు తెల్లని పొడిగా బూడిద రూపంలోకి వస్తోంది.
Also Read: జగన్ ను దగ్గరి నుంచి చూస్తే.. పోసాని షాకింగ్ వ్యాఖ్యలు