MLA Komatireddy Rajgopal Reddy: బీజేపీకి ఇప్పుడు దక్షిణ తెలంగాణలో చాలా బలం కావాలి. బలమైన నేతలు కావాలి. వారు కాంగ్రెస్సా, టీఆర్ఎస్సా అనేది ఇక్కడ పూర్తి అబ్జర్డ్. రంగారెడ్డి నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఆల్ రెడీ చేర్చుకున్నారు. పట్న మహేందర్రెడ్డి, తీగల కృష్ణారెడ్డి టచ్ లో ఉన్నారని చెబుతున్నారు. ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస రెడ్డి లైన్ లో ఉన్నాడు. తుమ్మల నాగేశ్వరరావు కూడా చేరుతారని చెబుతున్నారు. మహబూబ్ నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు అందుబాటులో ఉన్నాడు. ఇంకా కొంతమంది నేతలు అమిత్ షా తో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఇక్కడ జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మిగతా నేతల విషయం కొంచెం పక్కన పెడితే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారమే కొంచెం పొలిటికల్ సర్కిల్లో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. ఈమధ్య అమిత్ షా రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. అది కూడా దాదాపు గంట సేపు మాట్లాడుకున్నారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని రాజగోపాల్ రెడ్డి చెప్తున్నా.. అసలు విషయం వేరే ఉంది. మహారాష్ట్ర నుంచి జార్ఖండ్ దాకా ఈ మధ్య అమిత్ షా ఎవరినీ కలుసుకున్నా అది మర్యాదపూర్వక భేటీ అని మొదట్లో ప్రచారం జరుగుతోంది. తర్వాత జరగాల్సింది జరుగుతోంది. త్వరలో జార్ఖండ్ ప్రభుత్వం కూలేందుకు సిద్ధంగా ఉంద

నిషికాంత్ దూబే మధ్యవర్తిత్వం
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంట్రాక్ట్ సంస్థలు ఉన్నాయి. రోడ్లు, బొగ్గు రవాణా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లలో కోట్ల కొద్ది పనులు చేస్తున్నాడు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జల యజ్ఞం పనులు చేసిన మూడో అతిపెద్ద కాంట్రాక్ట్ సంస్థగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంపెనీ వినతికెక్కింది. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి తో మంచి సంబంధాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగాడు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్ వైపు చూసిన అంతగా ఫాయిదా లేకపోవడంతో మళ్లీ యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు పేరుకు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ ఆయన మనసంతా బీజేపీ వైఫై ఉంది.
Also Read: ABN RK Konda : ఏబీఎన్ ఆర్కేతో కేసీఆర్ సీక్రెట్స్ బయటపెట్టిన ‘కొండా’
మరో వైపు అమిత్ షా తో, ఆయన ఆఫీస్ తో మంచి యాక్సెస్ ఉంది. అమిత్ షా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు భేటీ అయ్యేందుకు ఝార్ఖండ్ లోని గోడా ఎంపీ నిషికాంత్ దూబే మధ్యవర్తత్వం వహించారని పొలిటికల్ సర్కిల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. నిషికాంత్ దూబే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు మంచి స్నేహితులు. ఇరువురి మధ్య కాంట్రాక్ట్ సంబంధాలు ఉన్నాయి. కిరణ్ బొగ్గు రవాణాలో ఇద్దరు కూడా డొమెస్టిక్ ఆపరేటర్లుగా ఉన్నారు. ఆ చనువుతోనే నిషికాంత్ దుబే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి తీసుకొస్తున్నారని తెలుస్తోంది. అయితే అమిత్ షా కోమటిరెడ్డి మధ్య సుదీర్ఘంగా జరిగిన భేటీలో రాజగోపాల్ రెడ్డిని వెంటనే రాజీనామా చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి సూచించారని, ఉప ఎన్నికతో కేసీఆర్ ను ఎంగేజ్ చేయాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. కానీ మోదీ షా ప్లాన్ వేరేలా ఉంది. వాస్తవానికి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని వారు కోరుకుంటున్నారు. ఎందుకంటే వారి లెక్కలు వారికున్నాయి.

ఇక ఈ భేటీ తర్వాత కోమటిరెడ్డి బిజెపిలో చేరతారా? ఒకవేళ ఆయన చేరితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి ఏంటి? ఇప్పటికే అధిష్టానం పై నా రాజ్ గా ఉన్న ఆయన కాషాయ కండువా కప్పుకుంటారా అనేది తేలాల్సి ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంత సులువుగా తేల్చే రకం కాదు. ఎప్పటినుంచో బిజెపిలోకి వెళ్తారని ప్రచారం ఉన్నా అది కాషాయ రూపం దాల్చడం లేదు. రేవంత్ రెడ్డికి ఆయనకి భేదాలు ఉన్నాయి కాబట్టే ఇప్పుడు అమిత్ కు బాగా దగ్గరయ్యారని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో బాగా బలపడాలని బిజెపి అనుకుంటోంది. తెలంగాణతో పోలిస్తే దక్షిణ తెలంగాణలో కాస్త వెనుకబడి ఉంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో బలమైన నేతల్ని చేర్చుకోవాలని బిజెపి భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారీగా చేరికలను ప్రోత్సహించాలని ఒక రోడ్డు మ్యాప్ వేసింది. ఈ క్రతువుకు కర్త, కర్మ, క్రియ అన్ని ఈటల రాజేందరే. ఇప్పటికి చాలా మంది నాయకులతో ఒక లిస్టు ప్రిపేర్ చేశారు. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నారు.
Also Read:Chandrababu: వైసీపీని ముంపులో ముంచుతానంటున్న చంద్రబాబు
[…] […]