Kolkata RG Kar Hospital: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్ కతా మహానగరంలోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలు హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఈ సంఘటన దేశాన్ని ఒక కుదుపు కుదుపుతోంది. ఈ దారుణంపై అక్కడి విపక్షాలు అధికార మమతా బెనర్జీ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. పైగా ఇటీవల కొంతమంది దుండగులు నిరసన చేపడుతున్న వైద్యులపై దాడి చేయడాన్ని తప్పు పడుతున్నాయి. అటు అధికార, ఇటు విపక్ష పార్టీల మధ్య పోటాపోటీగా విమర్శల పర్వం సాగుతోంది. ఈ క్రమంలో ఈ సంఘటనపై తొలిసారి పోలీసులు స్పందించారు. సంచలన విషయాలు వెల్లడించి ప్రకంపనలు సృష్టించారు. ఇంతకీ వారు ఏం చెప్పారంటే..
ఆ వైద్యురాలి పోస్టుమార్టం ప్రక్రియ మొత్తం మెజిస్ట్రేట్ పక్షంలో నిర్వహించారు. దానిని మొత్తం వీడియో తీశారు. పోస్టుమార్టం చేస్తున్నప్పుడు ఆమె శరీరంలో ఎముకలు విరిగినట్టు వైద్యులకు అనిపించలేదు.
ఆ వైద్యురాలి అంతర్గత అవయవాలలో 150 మిల్లి గ్రాముల ద్రవపదార్థం ఉన్నట్టు పోస్టుమార్టం నివేదికలో గుర్తించారని ఇటీవల వార్తలు వచ్చాయి. పైగా ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్టు కథనాలు ప్రచారం అయ్యాయి.. అయితే వీటిని పోలీసులు ఖండించారు.”ఇలాంటి వార్తలు ఎక్కడి నుంచి వస్తాయి అర్థం కావడం లేదు. ఈ సమాచారం అటు మీడియా, ఇటు సోషల్ మీడియాలో వివిధ మార్గాల ద్వారా చక్కర్లు కొడుతోంది. ప్రజలను గందరగోళానికి గురి చేసే ఇలాంటి ప్రయత్నాలు సరైనవి కావని” కోల్ కతా పోలీస్ చీఫ్ వినేష్ గోయల్ అన్నారు. బాధితురాలి తల్లిదండ్రులు కోర్టులో వేసిన పిటిషన్ వల్లే ఈ సమాచారం వ్యాప్తిలోకి వచ్చిందని పలు జాతీయ మీడియా ఛానల్స్ కథనాలను ప్రసారం చేశాయి.
ఆ వైద్యురాలు మృతి చెందినప్పుడు అసహజమరణంగా కేసు నమోదు చేశారు. దీనిపై కోల్ కతా సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు నమోదు చేయకపోవడం పట్ల ఆసుపత్రి యంత్రాంగం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనిపై కోల్ కతా పోలీస్ చీఫ్ స్పందించారు.”ఎటువంటి ఫిర్యాదు రానప్పుడు పోలీసులు మృతి కేసును అసహజమరణంగానే పేర్కొంటారు. ఎవరైనా ఫిర్యాదు చేసినా, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అది హత్య లేదా ఆత్మహత్య అనే విషయాన్ని ప్రస్తావిస్తారు. కానీ హత్య విషయాన్ని మేము దాచి పెట్టాల్సిన అవసరం లేదు. ఆత్మహత్యగా చిత్రీకరించాల్సిన ఉద్దేశం మాకు లేదని” వినేష్ గోయల్ అన్నారు.
సామాజిక మాధ్యమాలలో కొన్ని పోస్టులలో సహచర వైద్యులే ఈ దారుణానికి కారణమని పేర్కొన్నాయి. కొంతమంది పేర్లతో కూడిన జాబితాను సిబిఐ అధికారులకు మృతురాలి తల్లిదండ్రులు అందించారని స్పష్టం చేశాయి.. అయితే ఈ కేసులో ఒక వాలంటీర్ పేరు మీద ఇప్పటివరకు సిబిఐ ఇతర అనుమానితుల పేర్లను రికార్డులలో నమోదు చేయలేదు. ఇక ఈ కేసులో పెద్ద వ్యక్తుల ప్రమేయాన్ని పోలీసులు తోచిపొచ్చారు. ఆ జూనియర్ డాక్టర్ పేరుతో ఉన్న అనధికారిక ఒక ప్రిస్క్రిప్షన్ కాపీ కూడా సోషల్ మీడియాలో తెగవ్యాప్తిలో ఉంది. అయితే దానిని కూడా పోలీసులు ఖండించారు. ఇలాంటి విషయాలు బయటకి వెల్లడించడం సరికాదని వారు స్పష్టం చేశారు..