Telugu News » Photos » Wrestler vinesh phogat receives grand welcome at delhi airport
Vinesh Phogat: కాస్ రజతాన్ని దూరం చేయవచ్చు గాక.. కానీ నువ్వు మా బంగారు కొండవి..
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ లో బంగారు పతకం వస్తుందని అంచనా వేసిన క్రీడలలో కుస్తీ పోటీ ఒకటి. ఈ అంచనాలను నిజం చేస్తూ 50 కిలోల ప్రీ స్టైల్ విభాగంలో భారత మల్ల యోధురాలు వినేశ్ ఫొగాట్ ఫైనల్ దాకా వెళ్ళింది.
1 / 7
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ లో బంగారు పతకం వస్తుందని అంచనా వేసిన క్రీడలలో కుస్తీ పోటీ ఒకటి. ఈ అంచనాలను నిజం చేస్తూ 50 కిలోల ప్రీ స్టైల్ విభాగంలో భారత మల్ల యోధురాలు వినేశ్ ఫొగాట్ ఫైనల్ దాకా వెళ్ళింది. దురదృష్టవశాత్తు 100 గ్రాముల అధిక బరువు ఉందన్న నెపంతో ఆమె ఫైనల్ లో పోటీ పడకుండా వెనక్కి వచ్చేసింది. Image Source: X
2 / 7
తనను ఫైనల్ ఆడనీయకుండా తిరస్కరించిన పారిస్ ఒలంపిక్ కమిటీపై వినేశ్ కాస్ కు ఫిర్యాదు చేసింది. ఇద్దరు సుప్రసిద్ధ లాయర్లతో తన వాదనను కాస్ ఎదుట వినిపించింది. అయితే ఈ కేసు తీర్పును మూడుసార్లు వాయిదా వేసిన కాస్.. ఆ తర్వాత ఆమెపై విధించిన వేటు సరైనదని స్పష్టం చేసింది. Image Source: X
3 / 7
కాస్ తీర్పు నేపథ్యంలో వినేశ్ స్వదేశానికి చేరుకుంది. భారత అభిమానులను చూసి కన్నీటి పర్యంతమైంది. ఆమెకు భారత అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. Image Source: X
4 / 7
ఆమె మెడపై కరెన్సీ నోట్ల దండను వేశారు. ఆమెకు జేజేలు పలుకుతూ ఇంటిదాకా వాహనాల కాన్వాయ్ తో తోడుకొని వెళ్లారు. వేలాది మంది అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే వారంతా స్వచ్ఛందంగా వచ్చారు. Image Source: X
5 / 7
అభిమానులను చూసి వినేశ్ కన్నీటి పర్యంతమైంది. ఆమె వెంట కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా, రెజ్లర్లు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా వంటి వారు ఉన్నారు. ఆమెను బాధపడకూడదని ఓదార్చారు. Image Source: X
6 / 7
వినేశ్ ఇండియాకు వచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియాలో.. ఆమె గురించి విస్తృతమైన చర్చ జరుగుతోంది. కాస్ తీర్పు వల్ల రజతం కోల్పోయినప్పటికీ.. నువ్వు మా బంగారు కొండవని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో వీడ్కోలు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. Image Source: X
7 / 7
వచ్చే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో సత్తా చాటాలని వినేశ్ కు సూచిస్తున్నారు. భారతదేశానికి గోల్డ్ మెడల్ అందించాలని.. ఆ దిశగా బలంగా అడుగులు వేయాలని ఆమెను విన్నవిస్తున్నారు. Image Source: X