IRCTC Train  Insurance : 35 పైసలతో రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. వెంటనే తెలుసుకోండి..

ట్రైన్ టికెట్ తీసుకునేటప్పుడు ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆన్ లైన్ లో బాండ్ ఇస్తారు. దీని ప్రకారం రైలు ప్రయాణం చేసే సమయంలో ఏదైన ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే రూ. 10 లక్షల వరకు కుటుంబానికి చెల్లిస్తారు. అలాగే పూర్తిగా అవయవాలు పనిచేయని పక్షంలోనూ ఇంతే మొత్తం చెల్లిస్తారు. ఇక తీవ్రంగా గాయాలైతే రూ. 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ పొందవచ్చు.

Written By: Srinivas, Updated On : August 12, 2024 1:06 pm

IRCTC Train Insurance

Follow us on

IRCTC Train  Insurance  : కరోనా కాలం తరువాత మనిషి జీవితం మారిపోయింది. ముఖ్యంగా ఆరోగ్యం జీవనానికి సంబంధించి చాలా మంది కేర్ తీసుకుంటున్నారు. ఎవరికి? ఎప్పుడు? ఎలాంటి ఆపద వస్తుందోనని చాలా మంది భయపడిపోతున్నారు. ఈ క్రమంలో కుటుంబ పెద్ద మరణిస్తే తన కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితిని కొన్ని వార్తల ద్వారా చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో చాలా మంది కుటుంబ భద్రత కోసం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగిపోయింది. అయితే కొన్ని ఇన్సూరెన్స్ లు చాలా తక్కువ ఖర్చుకే కొనుగోలు చేయొచ్చు. వీటి ద్వారాపెద్ద మొత్తంలో ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణకు ఓ ఇన్సూరెన్స్ కు 35 పైసలు చెల్లిస్తే చాలు.. రూ.10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. అదెంటో తెలుసా?

కొంత మందికి ట్రైన్ జర్నీ చేయడం చాలా ఇష్టం. మిగతా ప్రయాణాల కంటే రైలు ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే రైలు ప్రయాణం చేసే ముందు ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. IRCTC ద్వారా టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఇక్కడ కింద బాక్స్ లో ఓ ఇన్సూరెన్స్ గురించి వివరాలు ఉంటాయి. అయితే దీని గురించి చాలా మంది పట్టించుకోరు. దీని ప్రకారం 35 పైసలు చెల్లిస్తే రూ.10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. ట్రైన్ లో జర్నీ చేసే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే ఈ ఇన్సూరెన్స్ కవర్ అవుతంది.

ట్రైన్ టికెట్ తీసుకునేటప్పుడు ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆన్ లైన్ లో బాండ్ ఇస్తారు. దీని ప్రకారం రైలు ప్రయాణం చేసే సమయంలో ఏదైన ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే రూ. 10 లక్షల వరకు కుటుంబానికి చెల్లిస్తారు. అలాగే పూర్తిగా అవయవాలు పనిచేయని పక్షంలోనూ ఇంతే మొత్తం చెల్లిస్తారు. ఇక తీవ్రంగా గాయాలైతే రూ. 2 లక్షల వరకు ఇన్సూరెన్స్ పొందవచ్చు. ఈ ప్రమాదం జరిగిన నాలుగు నెలల తరువాత క్లెయిమ్ చేసుకుంటే 15 రోజుల్లోగా ఇన్సూరెన్స్ మొత్తం కవర్ అవుతుంది.

రైలు ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి ఈ ఇన్సూరెన్స్ బాగా ఉపయోగపడుతుంది. కొన్ని సాధారణ ఇన్సూరెన్స్ లో యాక్సిడెంట్ పాలసీలు ఉన్నా రైలు ప్రమాదంలో వాటి పరిధిలోకి రావు. ఇలాంటప్పుడు ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కేవలం 35 పైసలు చెల్లిస్తే చాలు భారీ మొత్తంలో ఇన్సూరెన్స్ వస్తుంది. అయితే ఈ ఇన్సూరెన్స్ తీసుకున్న తరువాత ఆన్ లైన్లో వచ్చిన బాండ్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆ తరువాత క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. రైలు ప్రయాణాలు చేసే సమయంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగిన ట్రైన్ యాక్సడెంట్ లో 15 మందికిపైగా మరణించారు. అందువల్ల ముందే ఇన్సూరెన్స్ తీసుకుంటే కుటుంబ పెద్ద భారం ఆ కుటుంబం పడకుండా ఈ ఇన్సూరెన్స్ ఆదుకుంటుంది. పైగా ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా పెద్దగా లేకపోవడంతో ఈసారి ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఈ విషయాన్ని మరిచిపోకండి..