https://oktelugu.com/

Kodali Nani vs TDP: కొడాలి నాని ‘క్యాసినో’పై పడ్డ టీడీపీ.. గుడివాడలో గడబిడ

Kodali Nani vs TDP: గుడివాడలో గడబిడ మొదలైంది. ఏపీ మంత్రి కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్ లో ‘క్యాసినో’ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలతో టీడీపీ ముట్టడికి రెడీ అయ్యింది. దీనికి ప్రతిగా అధికార పార్టీ భారీగా పోలీసులను మోహరించడంతో రచ్చ రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గం కృష్ణా జిల్లా గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సంక్రాంతికి కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 21, 2022 / 12:54 PM IST
    Follow us on

    Kodali Nani vs TDP: గుడివాడలో గడబిడ మొదలైంది. ఏపీ మంత్రి కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్ లో ‘క్యాసినో’ నిర్వహిస్తున్నారన్న ఆరోపణలతో టీడీపీ ముట్టడికి రెడీ అయ్యింది. దీనికి ప్రతిగా అధికార పార్టీ భారీగా పోలీసులను మోహరించడంతో రచ్చ రచ్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

    ఏపీ మంత్రి కొడాలి నాని సొంత నియోజకవర్గం కృష్ణా జిల్లా గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సంక్రాంతికి కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్ లో ‘క్యాసినో’ నిర్వహించారని టీడీపీ ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది. ఈరోజు కొడాలి నాని కన్వెన్షన్ లో టీడీపీ కమిటీ పర్యటించి నిగ్గుతేల్చడానికి రెడీ అయ్యింది.

    ఇక టీడీపీ బృందం రాక విషయాన్ని తెలుసుకున్న వైసీపీ శ్రేణులు దీన్ని అడ్డుకునేందుకు కన్వెన్షన్ సెంటర్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారిపై బారికేడ్లు పెట్టారు.భారీగా పోలీసులను భారీగా మోహరించారు. టీడీపీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా చేరుకున్నారు.

    మంత్రి కొడాలి నాని మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు అమరావతి వెళ్లారు. ఆయన లేకపోవడంతో వైసీపీ శ్రేణులు అక్కడ మోహరించాయి. క్యాసినో నిర్వహణను నిగ్గు తేల్చేందుకు టీడీపీ ముఖ్య నేతలు బోండా ఉమా, కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్యతో ఆ పార్టీ నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ గుడివాడకు బయలు దేరింది. క్యాసినో నిర్వహించిన ప్రదేశాన్ని పరిశీలిస్తామని పట్టుబట్టింది. నివేదిక టీడీపీ అధిష్టానానికి సమర్పించనుంది.

    కొడాలి నాని ఏపీలో జూదాన్ని పెంచి పోషిస్తున్నారని.. దీనికి ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ అని పేరు పెట్టడాన్ని టీడీపీ నేత బొండా ఉమా ఖండించారు. మంత్రి కొడాలి నానిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆయనపై న్యాయ పోరాటం దిశగా టీడీపీ రెడీ అయ్యింది. దీంతో మంత్రి కొడాలి నాని చిక్కుల్లో పడ్డారు.