Samantha
Samantha: చైతు – సమంత విడాకుల పై అందరూ స్పందించారు. కానీ, ఇటు చై, అటు సామ్ ఈ అంశం పై ఏమి మాట్లాడటానికి కూడా పెద్దగా ఇష్టపడలేదు. అయితే, మొదటిసారి సమంతతో తన విడాకులపై నాగచైతన్య రీసెంట్ గా స్పందించాడు. అయితే తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి విడాకుల ప్రకటన పోస్టును తొలగించడం చర్చనీయాంశమైంది. సామ్-చై మళ్లీ కలుస్తున్నారా? లేదా వేరే కారణం ఏమైనా ఉందా? అని అభిమానుల్లో చర్చ మొదలైంది.
Samantha:
అయితే చైతూ మాత్రం ఆ పోస్టును డిలీట్ చేయకపోవడం గమనార్హం. మొత్తానికి సమంత షాకింగ్ నిర్ణయంతీసుకుందని.. విడాకుల పోస్ట్ డిలీట్ వెనుక ఏదో కారణం ఉందని తెలుస్తోంది. అయితే, తామిద్దరం విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో గతేడాది ప్రకటించి సమంత, నాగచైతన్య ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై చైతు మాత్రం.. ‘మేము విడాకులు తీసుకున్నాక సంతోషంగా ఉన్నాం అని, నేను హ్యాపీగా ఉన్నాను, సమంత కూడా చాలా హ్యాపీగా ఉంది. మా ఇద్దరి మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అంటూ చైతు చెప్పుకొచ్చాడు.
Also Read: మంత్రి అనిల్ కుమార్ పై హైదరాబాద్‌లో కేసు.. ఆడేసుకుంటున్న టీడీపీ నేతలు..!
Samantha
పనిలో పనిగా మేము ప్రస్తుతం ఎవరి పనుల్లో వాళ్ళం బిజీగా ఉన్నాం’ అని కూడా చైతు తెలిపాడు. మరి విడాకులపై నాగచైతన్య స్పందించినట్లు సమంత స్పందించలేదు. పైగా విడాకుల పోస్ట్ లు కూడా డిలీట్ చేసింది. గతంలో కూడా చైతు ‘మేం భార్యాభర్తలుగా విడిపోయినా.. ఎప్పటికీ మంచి స్నేహితులుగానే ఉంటామని చెప్పుకొచ్చాడు. అలాగే అటు సమంత కూడా ఇదే విషయాన్ని కాస్త అటు ఇటుగా మార్చి పోస్ట్ చేసింది. మరి ఇప్పుడు సామ్ ఆ పోస్ట్ లను ఎందుకు డిలీట్ చేసి ఉంటుందో చూడాలి.
Also Read: అవును.. ఆమె నేటి సూర్యకాంతం !