Kodali Nani Comments On Minister Post: మంత్రివర్గ విస్తరణపై సీఎం జగన్ ఓ క్లారిటీతో ఉన్నారు. ఎవరెవరిని కొనసాగించాలి? ఎవరిని తొలగించాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న మంత్రి కొడాలి నాని ని కేబినెట్ కొనసాగిస్తారా? లేక పక్కకు తొలగిస్తారా? అనే విషయం పై ఉత్కంఠ కొనసాగుతోంది. కేబినెట్ బెర్తులపై అందరికి అంచనాలున్నా జగన్ మదిలో ఎవరున్నారో తెలియడం లేదు. దీంతో కొడాలి నాని పదవిపై ప్రచారం సాగుతోంది. ఇన్నాళ్లు ఎవరినైనా తిట్టాలంటే నాని తోనే సాధ్యమయ్యేది. చంద్రబాబునైతే నాని పలుమార్లు పలు రకాలుగా బూతులు తిడుతూ జగన్ దగ్గర మెప్పు పొందేవాడు.
ఈ నేపథ్యంలో మంత్రి పదవిపై నాని కూడా క్లారిటీగానే ఉన్నారు. ఇప్పటికే జగన్ ఏ పదవి ఇచ్చినా సరే దానికి న్యాయం చేస్తానని చెబుతున్నారు. ఇది యాదృచ్చికంగా అన్నది కాదనే విషయం తెలుస్తోంది. మంత్రి పదవి ఉన్నా లేకున్నా వైసీపీ ఎదుగుదలకు నిరంతరం కష్టపడతానని పేర్కొనడం విశేషం. చంద్రబాబును టార్గెట్ చేసుకుని రెచ్చిపోతున్న నాని ఇకపై నిరంతర పోరాటం చేసేందుకే రెడీ అయినట్లు సమాచారం.
Also Read: Rahul Gandhi Tweet On Paddy Procurement: రాహుల్ దయతో ఎట్టకేలకు టీఆర్ఎస్ తో ఫైట్ కు కాంగ్రెస్ రెడీ..
ఇక గుడివాడలో తన రికార్డు ఎవరు బ్రేక్ చేయరని చెబుతున్నారు. జగన్ నుంచి సంకేతాలు వచ్చాయా లేదా ఆయనే ఇలా మాట్లాడుతున్నారా అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. నానికి కృష్ణా, గుంటూరు జిల్లాల రీజినల్ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం సాగుతోంది. మొత్తానికి మంత్రివర్గం విషయంలో జగన్ మాత్రం అందరికి ఇప్పటికే అవగాహన కల్పించినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 7న జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై ఇంకా స్పష్టత ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. అదే రోజు ఎవరెవరు కొనసాగుతారు? ఎవరు పక్కకు తప్పుకోవాలనే విషయం చెప్పనున్నారు. మంత్రివర్గ విస్తరణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. కానీ నేతల మాటల్లో కూడా అంతరార్థం ఎవరికి అర్థం కావడం లేదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందోననే దానిపై ఇంకా తర్జనభర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి.