Bigg Boss OTT Telugu: రియాలిటీ షోలలో బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గతంలో బుల్లితెరపై అలరించిన ఈ షో.. ఇప్పుడు ఓటీటీ వేదికగా మస్తు మజాను పంచుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త టాస్క్ లు, కంటెస్టెంట్స్ మధ్య విపరీతమైన గొడవలతో దుమ్ము లేపుతోంది. ఇక అన్నిటికంటే పెద్ద సవాలు ఏదైనా ఉంది అంటే అది నామినేషన్ ప్రక్రియ అని చెప్పుకోవాలి.
ఈ నామినేషన్ టాస్క్ వచ్చినప్పుడల్లా కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర గొడవలు జరుగుతున్నాయి. ఒకానొక సమయంలో కంటెస్టెంట్స్ కొట్టుకుంటున్నారు కూడా. అయితే గడిచిన నాలుగు వారాల్లో ముమైత్ ఖాన్, శ్రీ రాపాక, ఆర్ జె చైతు, సరయు ఎలిమినేట్ అయిపోయారు. ఇక 5వ వారం నామినేషన్స్ టాస్క్ సోమవారమే ముగియాల్సి ఉన్నా.. బిగ్ బాస్ ఇచ్చిన స్వైప్ టాస్క్ లతో మరింత రంజుగా మారింది.
Also Read:Rahul Gandhi Tweet On Paddy Procurement: రాహుల్ దయతో ఎట్టకేలకు టీఆర్ఎస్ తో ఫైట్ కు కాంగ్రెస్ రెడీ..
5వ వారం ఏడుగురు నామినేట్ అయ్యారు. వీరిలో ముగ్గురుని సేవ్ చేసుకునే విధంగా స్వైప్ టాస్క్ లను బిగ్ బాస్ ఇచ్చాడు. అయితే మొదటి టాస్క్ లో భాగంగా నీటి బుడగలు ఎవరైతే చివరివరకు ఉంచుకుంటారో.. వారి ప్లేస్ లో నామినేట్ కాని వారిలో ఒకరు నామినేట్ అవ్వాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో అషు రెడ్డి గెలవడంతో.. నామినేట్ కాని వారంతా మాట్లాడుకుని స్రవంతిని నామినేట్ చేశారు.
ఇక రెండో టాస్క్ లో ఓ పెయింట్ బాక్స్ లో ఎవరైతే ఎక్కువ ఫుట్ వేర్ లను ఉంచుతారో వారే విజేతలు. అయితే ఇందులో అరియానా 11 జతలను ముంచుతా అని చెప్పగా.. బిందు మాధవి 12 జతలను ముంచుతా అని చెబుతుంది. చివరకు అరియానాను ఒప్పించి ఆరు జతలను మాత్రమే ముంచి విజేతగా నిలుస్తుంది. దీంతో ఆమె ప్లేస్ లో తేజస్విని నామినేట్ చేశారు.
ఇక చివరి టాస్క్ అయిన బలప్రదర్శనలో మహేష్ విట్టా గెలుస్తాడు. కాగా ఈ సమయంలో నామినేట్ కానీ సభ్యుల మధ్య తీవ్ర గొడవ జరుగుతుంది. ఎవరిని నామినేట్ చేయాలనే విషయం మీద ఒకరిపై ఒకరు అరుచుకుంటారు. ఇక చివరకు నటరాజ్ మాస్టర్ తన వ్యక్తిగత నిర్ణయంతో బిందు మాధవిని నామినేట్ చేస్తాడు. దీంతో ఐదో వారం బిందు మాధవి, అరియానా, తేజస్వి, యాంకర్ శివ, స్రవంతి, మిత్రశర్మ, అనిల్ రాథోడ్ నామినేషన్స్ లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.