Kisan Credit Card low Interest loan : ఈ రుణాన్ని సకాలంలో రైతులు తిరిగి చెల్లించినట్లయితే వాళ్లకు మరింత తక్కువ వడ్డీకి రూ.3 లక్షల వరకు రుణాలు అందిస్తుంది. రైతులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు ఇవి చాలా సహాయపడతాయి. కేంద్ర ప్రభుత్వం పంట పెట్టుబడికి డబ్బులు దొరకకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు రైతుల కోసం ఒక పెద్ద శుభవార్త తెలిపింది. కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డు తక్కువ వడ్డీ రుణ పథకాన్ని 2025- 26 ఆర్థిక సంవత్సరానికి కూడా కొనసాగించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రైతులు ఇకపై కూడా తమ తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించినట్లయితే వాళ్లు మరింత తక్కువ వడ్డీకే రుణాలను తీసుకోవచ్చు. సవరించిన వడ్డీ రాయితీ పథకం కింద రైతులు 3 లక్షల వరకు కెసిసి ద్వారా స్వల్పకాలిక రుణాలను తీసుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. సాధారణంగా ఇటువంటి రుణాలకు ఏడు శాతం వడ్డీ రేటు ఉంటుంది. 1.5% వడ్డీ రాయితీ ప్రభుత్వ బ్యాంకులకు ఉంటుంది. రుణం తీసుకున్న తర్వాత రైతులు వాటిని సకాలంలో తిరిగి చెల్లించినట్లయితే వారికి మూడు శాతం వడ్డీ రాయితీ అదనంగా లభిస్తుంది.
Also Read : 600 కన్నా సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. ఈ విధంగా చేస్తే రూ.5 లక్షల లోన్ గ్యారెంటీ..
ఈ విధంగా చూసుకుంటే సకాలంలో చెల్లించిన రైతులకు వాస్తవంగా వడ్డీ రేటు కేవలం నాలుగు శాతానికి తగ్గుతుంది. కేవలం పంటలకే కాకుండా పశుపోషణ అలాగే మత్స్య పరిశ్రమల కోసం కూడా రెండు లక్షల వరకు రుణాలు తీసుకునే రైతులకు ఈ వడ్డీ రాయితీ వర్తిస్తుంది అని తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం మరోవైపు రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన కింద రైతులకు పంట సాయం కోసం అర్హులైన రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేలు అందిస్తున్న సంగతి తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వ మందు ఇస్తున్న ఈ సాయం ఆర్థికంగా బలహీనంగా ఉన్న రైతులపై పెట్టుబడి భారం తగ్గేలా చేస్తుంది. రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తుండడంతో వాళ్లు మంచి విత్తనాలు, ఎరువులు అలాగే పంటకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేసి మంచి దిగుబడులను రాబట్టుకోవచ్చు. తీసుకున్నారు రుణాలను సకాలంలో చెల్లించడం వలన రైతులు అదనపు ప్రోత్సాహకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి పొందవచ్చు.