CIBIL score : బ్యాంకులు రుణం మంజూరు చేయాలంటే మంచి సిబిల్ స్కోర్ ఉండాలి. సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోతే బ్యాంకుల నుంచి రుణం పొందడం అసాధ్యమని చెప్పొచ్చు. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ 750 నుంచి 900 మధ్య ఉన్నట్లయితే మీరు బ్యాంకుల నుంచి ఈజీగా తక్కువ వడ్డీ రేట్లకు రుణం అందుకోవచ్చు. మీ సిబిల్ స్కోర్ దీనికంటే తక్కువగా ఉంటే మీరు రుణాలు పొందడం చాలా కష్టమని నిపుణులు చెప్తున్నారు. కొన్ని కొన్ని సార్లు మీ ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేని సమయంలో మీరు వాయిదాలను సకాలంలో చెల్లించకపోతే మీ సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఒకవేళ మీ సిబిల్ స్కోర్ 600 కన్నా కూడా తగ్గిపోతే మీరు బ్యాంకు నుంచి రుణం పొందడం అసాధ్యమని చెప్పొచ్చు. మీ సిబిల్ స్కోర్ 600 కంటే తక్కువగా ఉన్నా కూడా మీరు రుణం పొందాలని అనుకుంటున్నాట్లయితే మీ దగ్గర ఉన్న ఎల్ఐసి పాలసీని మీరు గ్యారెంటీగా పెట్టి కూడా రుణం తీసుకోవచ్చు. ఎల్ఐసి పాలసీన గ్యారెంటీగా పెట్టి రుణం పొందడం అనేది చాలా ఈజీ ప్రక్రియ. సిబిల్ స్కోర్ చాలా తక్కువగా ఉన్నా కూడా ఎల్ఐసి పాలసీ పై మీకు రుణం మంజూరు చేస్తారు.
Also Read : ఈ 4 సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే సిబిల్ స్కోర్ 800 కు పెరుగుతుంది..
ఈ విధంగా ఎల్ఐసి పాలసీని గ్యారెంటీగా పెట్టి తీసుకునే రుణాన్ని సెక్యూరిటీ రుణం అని అంటారు. ఈ విధంగా రుణం తీసుకోవడం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎల్ఐసి పాలసీలు ఎండోమెంట్ ప్లాన్స్,హోల్ లైఫ్ పాలసీస్ మీద మీరు రుణం తీసుకోవచ్చు. దాదాపు మూడేళ్ల పాటు ప్రీమియం చెల్లించిన ఎల్ఐసి పాలసీల పైన మాత్రమే మీరు రుణం తీసుకోవచ్చు. మీ యొక్క సరెండర్ వ్యాల్యూ పైన మీకు 80 నుంచి 90 శాతం వరకు రుణం అందే అవకాశం ఉంది. ఉదాహరణకు చెప్పాలంటే ఒకవేళ మీ సరెండర్ వ్యాల్యూ ఐదు లక్షల రూపాయలు అయినట్లయితే అప్పుడు మీకు నాలుగు లక్షల రూపాయల వరకు రుణం వచ్చే ఛాన్స్ ఉంది.
మీకు సమీపంలో ఉన్న ఎల్ఐసి కార్యాలయానికి వెళ్లి లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా మీరు ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఇది అన్ని రకాల ఎల్ఐసి పాలసీలకు వర్తించదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎల్ఐసి లో కొన్ని ఎంపిక చేసిన పాలసీలకు మాత్రమే మీరు ఈ రుణం పొందే అవకాశం ఉంటుంది. ఎల్ఐసి పాలసీ గ్యారెంటీగా పెట్టి మీరు పొందే రుణంపై మీకు వడ్డీ 10 నుంచి 12 శాతం వరకు ఉంటుంది అని తెలుసుకోవాలి.