
Delhi: చిన్న గొడవకే ప్రాణాలు పోయాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకుని రెండు వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డాయి. దీంతో ఒకరి ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో గందరగోళం నెలకొంది. వీధి రౌడీల్లా ప్రవర్తించిన వారి ఆగడాలకు హద్దు లేకుండా పోతోంది. క్షణికావేశంలో రెండు ప్రాణాలు గాల్లో కలిసే విధంగా వాతావరణం ఏర్పడింది. దీంతో రక్తపాతానికి ఢిల్లీ వేదికైంది.
ఢిల్లీ(Delhi)లోని షాహదారా ప్రాంతానికి చెందిన నరసింగ్ అదే ప్రాంతంలో పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు. గొడవ అక్కడే జరిగింది. ఒక రోజు నరసింగ్ సోదరుడి కుమారుడు హేమంత్ అతడి స్నేహితుడితో అక్కడకు వచ్చి గుట్కా కావాలని అడిగాడు. దీంతో అదే సమయంలో షోయెబ్, సోహైల్ అన ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడికి వచ్చి వారు కూడా గుట్కా కావాలని అడిగారు. దీంతో తన దగ్గర ఉన్న గుట్కా ప్యాకెట్ ను తన సోదరుడి కుమారుడు హేమంత్ కు ఇచ్చాడు. దీంతో షోయెబ్ ఆగ్రహానికి గురయ్యాడు.
నరసింగ్ ను దుర్భాషలాడాడు. తాను ముందు అడిగితే తనకు ఇవ్వకుండా మరొకరికి ఇవ్వడంపై రచ్చ చేశాడు.దీంతో హేమంత్ కలగజేసుకుని బాబాయ్ ను మరో మాట అంటే బాగుండదని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాడు. దీంతో హేమంత్ షోయబ్ పై దాడి చేసి అక్కడి నుంచి పంపించాడు.
షోయబ్ తరువాత తన స్నేహితులతో వచ్చి మరోమారు గొడవ చేసేందుకు ప్రయత్నించగా నరసింగ్ కత్తెరతో షోయబ్, సోహైల్ పై దాడి చేశాడు. దీంతో సోయబ్ కు కత్తెర చాతీలో దిగడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. సోహైల్ కు కూడా కత్తెర వీపు భాగంలో గుచ్చుకుంది. దీంతో అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.
Also Read: చంద్రబాబు అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్.. కలిసి సాగడం ఖాయమా?