https://oktelugu.com/

Manchi Rojulu Vachayi: “మంచి రోజులు వచ్చాయి” టైటిల్ సాంగ్ విడుదల…

Manchi Rojulu Vachayi: టాలీవుడ్ లో కామెడీ ,డిఫరెంట్ క్యారెక్టర్ చిత్రాలను తెరకెక్కించడంలో డైరెక్టర్ మారుతికి ఎవరు సాటి లేరు అని చెప్పాలి.  కొత్తజంట, ప్రేమ కథ, మహానుభావుడు, భలే భలే మగాడివోయ్ వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి విజయం అందుకున్నారు మారుతి. సాయి ధరమ్ తేజ్ నటించిన “ప్రతి రోజు పండగే” మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్… ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు ఏ సినిమాను తెరకెక్కించ లేదు. ప్రస్తుతం యువీ కాన్సెప్ట్స్‌, […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 27, 2021 / 05:01 PM IST
    Follow us on

    Manchi Rojulu Vachayi: టాలీవుడ్ లో కామెడీ ,డిఫరెంట్ క్యారెక్టర్ చిత్రాలను తెరకెక్కించడంలో డైరెక్టర్ మారుతికి ఎవరు సాటి లేరు అని చెప్పాలి.  కొత్తజంట, ప్రేమ కథ, మహానుభావుడు, భలే భలే మగాడివోయ్ వంటి చిత్రాలను తెరకెక్కించి మంచి విజయం అందుకున్నారు మారుతి. సాయి ధరమ్ తేజ్ నటించిన “ప్రతి రోజు పండగే” మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్… ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు ఏ సినిమాను తెరకెక్కించ లేదు.

    ప్రస్తుతం యువీ కాన్సెప్ట్స్‌, మాస్‌ మూవీ మేకర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న “మంచి రోజులు వచ్చాయి”చిత్రాన్నితెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ చిత్రంలో సంతోష్‌ శోభన్‌, మెహ్రీన్‌ జంటగా నటిస్తున్నారు. ఈ మూవీకి అనూప్‌ రూబెన్స్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో  విడుదలైన పాటలు, టీజర్ లకు మంచి స్పందన లభించిందని చెప్పాలి. అయితే ఇటీవల ఈ మూవీ టైటిల్ సాంగ్ ని చిత్ర బృందం  రిలీజ్ చేశారు.

    ఈ నెల 4 న దీపావళి కానుకగా “మంచి రోజులు వచ్చాయి” చిత్రం ప్రేక్షకులను అలరించనున్నది.  ఈ నేపధ్యంలో ” మంచి రోజులొచ్చాయి…  అందరికి మంచి రోజులొచ్చాయి అంటూ హుషారుగా సాగుతున్న పాట ఆడియన్స్ కు బాగా నాచుతుందనే చెప్పాలి. ఈ పాటను హరిచరణ్‌, శ్రావణి ఆలపించారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని వినోదాత్మకంగా అలరిస్తుందని మారుతి తెలిపారు‌. ఈ సినిమా “ప్రతి రోజు పండగే” సినిమా లానే  సూపర్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి మరి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.