https://oktelugu.com/

Sai Dharam Tej: బైక్ యాక్సిడెంట్ లో కోలుకున్న సాయి తేజ్… త్వరలోనే షూటింగ్స్ కి రాక…

Sai Dharam Tej: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురై హాస్పిటల్ లో చేరిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో మీడియా చేసిన రచ్చ అంతా ఇంత కాదు. పలువురు సినీ ప్రముఖులు కూడా మీడియా వైఖరిని తప్పుబట్టారు. దాదాపు నెల రోజులకు పైగా అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొంది… ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు తేజ్. కొద్ది రోజుల క్రితం తాను కోలుకుంటున్నట్టు స్వయంగా తెలియ జేస్తూ, థంబ్ సింబల్‌తో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 27, 2021 / 04:45 PM IST
    Follow us on

    Sai Dharam Tej: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ కు గురై హాస్పిటల్ లో చేరిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయంలో మీడియా చేసిన రచ్చ అంతా ఇంత కాదు. పలువురు సినీ ప్రముఖులు కూడా మీడియా వైఖరిని తప్పుబట్టారు. దాదాపు నెల రోజులకు పైగా అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొంది… ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు తేజ్. కొద్ది రోజుల క్రితం తాను కోలుకుంటున్నట్టు స్వయంగా తెలియ జేస్తూ, థంబ్ సింబల్‌తో ట్వీట్ చేసి అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పారు సాయి ధరమ్ తేజ్.

    ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గరే ఉంటూ ఆయన ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఆయన గాయాల నుంచి పూర్తిగా కోలుకుని…  ఇప్పుడు నార్మల్ స్థితికి చేరుకున్నారని సమాచారం. ప్రస్తుతం ఫిజియో థెరపీ, స్పీచ్ థెరపీ ట్రీట్ మెంట్స్ లో ఉన్నారని… ముఖంపై తగిలిన గాయాలు తగ్గుముఖం పట్టాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాగా త్వరలోనే పూర్తి కండీషన్ లోకి వస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఆయన ఆరోగ్యం పట్ల వారి కుటుంబ సభ్యులంతా హర్షం వ్యక్తం చేస్తూ… తేజ్ కోసం ప్రార్ధించిన వారందరికి ధన్యవాదలు తెలుపుతున్నారు.

     

    ఇటీవలే తేజ్ నటించిన ” రిపబ్లిక్ ” సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయం అందుకుంది. దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జెబి  ఎంటర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు . సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ జంటగా నటించారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో  మంచి ఆదరణ లభించింది. కాగా  త్వరలోనే తన కెరీర్‌లో రాబోతున్న 15వ చిత్ర షూటింగ్‌లో సాయి ధరమ్ తేజ్ జాయిన్ కానున్నారట.