Homeజాతీయ వార్తలుVande Mataram: మోడీ మాస్టర్స్‌ స్ట్రోక్‌.. అంతా అవాక్కయ్యారు

Vande Mataram: మోడీ మాస్టర్స్‌ స్ట్రోక్‌.. అంతా అవాక్కయ్యారు

Vande Mataram: కీలెరిగి వాత పట్టెడంలో, శత్రువును అత్యంత ఇబ్బందికర పరిస్థితిలోని నెట్టడంలో ప్రధాని నరేంద్రమోదీ నిపుణుడు. క్లిష్టమైన పరిస్థితిలో అనూహ్యమైన ఎత్తుగడ వేస్తారు. దానికి విపక్షాలు, రాజకీయ ప్రత్యర్థులు, జాతీయవాదులు ఏమీ అనలేని పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం దేశంలో మాజీ సైనికాధికారి రణావరే రాసినట్టు చెబుతున్న పుస్తకం తన వద్ద ఉందని రాహుల్‌గాంధీ వివాదం చేస్తున్నారు. ఇదే సమయంలో స్పీకర్‌పై విపక్షాలు స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. మరోవైపు అమెరికాతో కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై విపక్షాలు మోదీకి దేశభక్తి పాఠాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మోదీ ఓ ఎత్తుగడ వేశారు. 90 ఏళ్లుగా ఈ దేశం ఎదురు చూస్తున్న ఎత్తుగడ. ఇకపై బహిరంగ కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరం పూర్తిగా పాడాలి. వందేమాతరం, జనగణమనది ఒకేస్థాయి అని హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ముస్లిం ఓటుబ్యాంకు రాజకీయాలు చేసేవారికి ఇది గొడ్డలి పెట్టు.

చారిత్రక నేపథ్యం..
1885లో బంకిం చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం స్వదేశీ ఉద్యమానికి ప్రేరణ. 1937లో నెహ్రూ కేవలం మొదటి చరణాన్ని మాత్రమే అధికారికం చేశారు. 150 సంవత్సరాల సందర్భంగా మోదీ ప్రభుత్వం పూర్తి గేయాన్ని పునరుద్ఘాటించడం చారిత్రక మలుపుగా మారింది.

రాజకీయ వ్యూహం..
విపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహం రూపొందిస్తున్న సమయంలో మోదీ రాజకీయ చతురత ప్రదర్శించి విపక్షాలకు మాస్టర్‌ స్ట్రోక్‌ ఇచ్చారు. ఇకపై జనగణమనలా వందేమాతరం పాడే సమయంలో నిలబడాలి. పద్మ అవార్డులు, జాతీయ కార్యక్రమాల్లో తప్పనిసరి. ఇది దేశభక్తి చర్చల్లోకి తీసుకువచ్చి, వివాదాలను దూరం చేస్తుందని వాదన. 80% హిందువులు, దేశభక్తి భావాలు బలపడతాయని మద్దతు. ఇప్పటి వరకు వందేమాతరం నాలుగు లైన్లే(ఒకే చరణం) పాడేవారు. కానీ, ఇప్పుడు 3 నిమిషాల 10 సెకన్లు పాడాల్సి ఉంటుంది. జనగణమనకు నిలబడినట్లుగానే వందేమాతరం పాడుతున్న సమయంలో లేచి నిలబడాలి. ఇప్పటి వరకు కొందరు నిలబడడాన్ని వివాదం చేసిన నేతలు ఉన్నారు. కానీ ఇప్పుడు లేచి నిలబడడం తప్పనిసరి. జనగణమనకు ముందే వంతేమాతరం పాడాలి.

వ్యతిరేకించే పరిస్థితి లేదు..
దేశభక్తి గురించి మాట్లాడుతున్నవారు ఇకపై వందేమాతరం వ్యతిరేకించలేదు. ఇందులో దుర్గామాత, లక్ష్మీ, పార్వతి ప్రస్తావన ఉంది. దుర్గాను పది ఆయుధాలు పట్టిన అమ్మవారిగా వర్ణించే పదాలు ఉన్నాయి. ఈ కారణంతో వ్యతిరేకిస్తే ఓట్లు పడవు. వివాదాల్లో ఉన్నవారు వందేమాతరంపై ఫోకస్‌ చేయడం లేదు. ప్రింట్‌ కాని పుస్తకం గురించి మాట్లాడుతున్న విపక్షాలు, స్పీకర్‌పై అవిశ్వాసానికి వ్యూహాలు రచిస్తున్న విపక్షాలు కూడా దీనిపై స్పందించడం లేదు. వ్యతిరేకించే పరిస్థితి కూడా లేదు. కోర్టుకు వెళ్లే అవకాశం లేదు.

మొత్తంగా త్రివర్ణ పతాకం ఎగురవేసే సమయంలో పూర్తి వందేమాతరం పాడాలి. రాష్ట్రపతి పాల్గొనే ప్రతీ కార్యక్రమంలో వందేమాతరం పాడాలి, గవర్నర్‌ పాల్గొనే కార్యక్రమాల్లో, పద్మ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో వందేమాతరం పాడాలి. పాడము అని అంటే వాళ్ల అసలు రంగు బయటపడుతుంది. ఒక్క దెబ్బతో విపక్షాల నోరు మూయించిన మోదీ.. మాస్టర్‌ స్ట్రోక్‌ ఇచ్చారు. ఇందులో రాజకీయం దేశభక్తి, జాతీయవాదం ఉన్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version