ఏపీ గవర్నర్ కు తాను రాసిన లేఖలు.. అత్యంత గోప్యాంగా ఉండాల్సింది పోయి.. రాజ్ భవన్ నుంచి లీక్ అయ్యాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సీబీఐ విచారణ కోరుతూ.. హైకోర్టులో పిటీషన్ చేయడం సంచలనాత్మకంగా మారింది. ఆయన ఎన్నికల ప్రక్రియలో వ్యవహారాలను మొత్తం గవర్నర్ కు నివేదించాల్సి ఉంటుంది. ఇలా నివేదిస్తున్న సమయలో.. జరుగుతున్న పరిణామాలపై ఆయన రాసిన లేఖలు.. గవర్నర్ కు పంపిన సమయంలో.. ఆయనకన్నా ముందుగానో.. ఆయన చూసిన తరువాతనో లీకయ్యాయి.
Also Read: జగన్ కు షాకిచ్చిన కేంద్రం
అవి సాదాసీదా వ్యక్తులకు లీక్ చేయలేదు. ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకే లీకయ్యాయి. సమాచారం మాత్రమే కాదు.. ఆ లేఖల కాపీలు కూడా వారికి చేరాయి. ఆ ప్రకారమే వారు నిమ్మగడ్డపై ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చు. అంతేకాదు.. సోషల్ మీడియాలోనూ పోస్టు చేశారు. వాటిని తాము అధికారికంగా ప్రభుత్వానికి పంపామని గవర్నర్ కార్యాలయం ప్రకటించలేదు. అంటే కచ్చితంగా గవర్నర్ కార్యాలం నుంచే లీకయినట్లు భావించాలి. ఈ వ్యవహారం అధికార రహస్యాలను బహిర్గతం చేయడం లాంటిదే. ఇలాంటి చర్యలు రాజ్ భవన్ ప్రతిష్టకే మచ్చ.
గవర్నర్ తరఫున సాంకేతిక వ్యవహారాన్ని ఆయన కార్యదర్శే చూస్తారు. లేఖలు కూడా ఆయనకే ముందుగా అందుతాయి. ఆయన చూసి వివరాలు గవర్నర్ కు చెబుతారు. ఇక్కడ కార్యదర్శి గవర్నర్ కన్నా ముందే.. ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారని తాజా పిటిషన్ లో స్పష్టమవుతోంది. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే.. అంతకన్నా అవమానం మరోటి ఉండదు. అందుకే ఈ కేసు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒకవేళ విచారణకు ఆదేశించకపోతే.. ఎస్ఈసీ ఆందోళనను కోర్టు పట్టించుకోనట్లు అవుతుంది.
Also Read: ఏపీలో.. ఏప్రిల్ ‘పథకాల మాసం’..
రాష్ట్ర పోలీసుల విచారణకు ఆదేశించినా.. అది మరిన్ని వివాదాలకు కారణం అవుతుంది. ఇప్పుడీ సమస్యకు పరిష్కరం.. రాజ్యాంగ వ్యవస్థల గౌరవం కాపాడాల్సిన బాధ్యత రాజ్ భవన్ పైనే ఉందన్న చర్చ జరుగుతోంది. లీకువీరుల్ని గుర్తించి.. అధికార రహస్యాల లీకేజీ కింద కఠిన చర్యలు తీసుకోకపోతే… రాజ్ భవన్ ప్రతిష్ట మసకబారే ప్రమాదం ఉందని పలువురు భావిస్తున్నారు. ఈ విషయంలో గవర్నర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి..