ఒకే సినిమాను మ‌ళ్లీ తీశారు.. రెండు సార్లూ బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్‌!

ఒకే టైటిల్ తో రెండో సినిమా వ‌స్తోందంటే ఆడియ‌న్స్ అడ్జ‌స్ట్ అవుతారేమోగానీ.. అదే సినిమాను మ‌ళ్లీ చూపిస్తామంటే చూస్తారా..? యాక్టర్లు కూడా వాళ్లే ఉన్నారంటే.. అసలు యాక్సెప్టు చేస్తారా..? కానీ.. ఇది జరిగింది! ప్రేక్ష‌కులు అంగీక‌రించారు. బొమ్మ రెండో సారి కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. ఆ చిత్ర‌మే.. ఎన్టీఆర్‌, ఏఎన్నార్ కీల‌క‌పాత్ర‌లో న‌టించిన ‘భూ కైలాస్’. ఈ సినిమా రెండోసారి విడుదలై శనివారం (మార్చి 20)తో 63 వసంతాలు పూర్తయ్యాయి! చిత్ర నిర్మాణం ప‌ట్ల […]

Written By: Bhaskar, Updated On : March 21, 2021 12:27 pm
Follow us on


ఒకే టైటిల్ తో రెండో సినిమా వ‌స్తోందంటే ఆడియ‌న్స్ అడ్జ‌స్ట్ అవుతారేమోగానీ.. అదే సినిమాను మ‌ళ్లీ చూపిస్తామంటే చూస్తారా..? యాక్టర్లు కూడా వాళ్లే ఉన్నారంటే.. అసలు యాక్సెప్టు చేస్తారా..? కానీ.. ఇది జరిగింది! ప్రేక్ష‌కులు అంగీక‌రించారు. బొమ్మ రెండో సారి కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. ఆ చిత్ర‌మే.. ఎన్టీఆర్‌, ఏఎన్నార్ కీల‌క‌పాత్ర‌లో న‌టించిన ‘భూ కైలాస్’. ఈ సినిమా రెండోసారి విడుదలై శనివారం (మార్చి 20)తో 63 వసంతాలు పూర్తయ్యాయి!

చిత్ర నిర్మాణం ప‌ట్ల ఎంత అంకితభావం ఉన్న ప్ర‌ముఖ నిర్మాత ఎ.వి.మెయ్య‌ప్ప‌న్ చెట్టియార్ 1940లో ‘భూ కైలాస్’ చిత్రాన్ని తెలుగులో నిర్మించారు. అప్పటికే ఆయ‌న అప్పుల్లో మునిగిపోయారు. దీంతో.. ఈ సినిమా ఫ‌లితం ఎలా ఉంటుందోన‌ని కొన‌డానికి ఎవ‌రూ ముందుకు రాలేదు. దీంతో.. ఆయ‌నే స్వ‌యంగా ఒక సినిమా టాకీసును అద్దెకు తీసుకొని ఈ చిత్రాన్ని విడుద‌ల చేశారు. ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

ఆ త‌ర్వాత ఇదే సినిమాను ఆయ‌న త‌మిళంలో, మ‌ల‌యాళంలోనూ రీమేక్ చేశారు. అక్క‌డ కూడా సూప‌ర్ హిట్ కొట్టిందీ సినిమా. మ‌రో ప‌ద్దెనిమిది సంవ‌త్స‌రాల త‌ర్వాత ఇదే భూ కైలాస్ చిత్రాన్ని 1958లో తెలుగులో మ‌ళ్లీ తీశాడు అదే నిర్మాత‌. పాత్రధారులను ఇటు అటు మార్చి, పాత సినిమాలోని నటీనటులతోనే కొత్తగా నిర్మించారు. ఇందులో ఎన్టీఆర్ రావ‌ణాసురుడిగా న‌టించారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు నారదుడిగా, జ‌మున మండోద‌రిగా, ఎస్వీఆర్ మ‌యాసురుడుగా న‌టించారు.

ఓ ఏడాది త‌ర్వాత పేరు మార్చి త‌మిళంలో కూడా డ‌బ్ చేశారు. ‘భ‌క్తి రావ‌ణ‌’ పేరుతో 1959లో తమిళనాట విడుదల చేయగా.. అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. అంటే.. తమిళంలో కూడా రెండోసారి తెరకెక్కినట్టుగానే భావించొచ్చు. అక్కడ కూడా సెకండ్ టైమ్ హిట్ కొట్టిందని లెక్కేసుకోవచ్చు. ఈ విధంగా.. ఒకే సినిమా రెండు సార్లు తెరకెక్కి, రెండు సార్లూ ఘన విజయం సాధించడం నిజంగా గొప్ప విషయమే కదా!