Madhu Yashki- Revanth Reddy: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అందరు ఊహించినట్లుగానే మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయన సమీప అభ్యర్థి శశిథరూర్ పై దాదాపు 6800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఇరవై నాలుగేళ్ల తరువాత గాంధీయేతర అధ్యక్షుడుగా ఖర్గే ఎన్నికయ్యారు. మొదటి నుంచి ఖర్గే గెలుస్తారని తెలిసినా ఎంత మెజార్టీ వస్తుందనే దానిపైనే అందరికి అనుమానాలు ఉండేవి. దీంతో కాంగ్రెస్ పార్టీ ఖర్గే నాయకత్వంలో చురుకుగా ముందుకు సాగుతుందని అందరు ఆశిస్తున్నారు. ఆయన నాయకత్వంపై అందరికి మంచి అభిప్రాయమే ఉంది. అందుకే అంత మెజార్టీతో గెలిపించారు.

కాంగ్రెస్ పార్టీకి 1939, 1950, 1977, 1997, 2000 సంవత్సరాల్లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. మళ్లీ 22 ఏళ్ల తరువాత ఎన్నికలు జరడంతో గాంధీయేతర వ్యక్తికి పగ్గాలు అందాయి. ఇంతకు ముందు గాంధీయేతర నాయకుడిగా సీతారాం కేసరి అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు ఖర్గే నాయకత్వంలో పార్టీ ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 17న ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు ఎన్నికలు జరిగాయి. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కౌంటింగ్ నిర్వహించారు. ఇందులో 96 శాతం ఓటింగ్ జరిగింది.
కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లాంటి వారు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోటీ మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ మధ్య నెలకొంది. దీంతో ఖర్గేకు 6800 ఓట్లు రాగా శశిథరూర్ కు 1072 ఓట్లు వచ్చాయి. దీంతో ఖర్గే విజయం ఖాయమైంది. 415 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. 137ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర కుటుంబ సభ్యుడు అధ్యక్షుడిగా రావడంతో పార్టీ భవిష్యత్ పై అందరికి దృష్టి ఏర్పడింది.

మల్లికార్జున ఖర్గే విజయంపై టీపీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్, మాజీ ఎంపీ మల్లు రవి హర్షం వ్యక్తం చేశారు. ఖర్గే నాయకత్వంలో పార్టీ చురుకుగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే ఎన్నికల్లో ఖర్గే నాయకత్వంలో పార్టీ మరింత ప్రగతి సాధిస్తుందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని పేర్కొన్నారు. పార్టీకి మంచి రోజులు వచ్చాయని అన్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికయినప్పుడు ఎంతో మంది ఆయనపై విద్వేషాలు పెంచుకున్నా క్రమంగా పార్టీలో పరిస్థితులు మారాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని అందరు స్వాగతిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన ఖర్గే నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేయడంతో భవిష్యత్ బంగారుమయం అవుతుందని చెబుతున్నారు. పార్టీని దేశంలో మరోమారు అధికారంలోకి తీసుకొచ్చే క్రమంలో నాయకులు సహకరించాలని కోరుతున్నారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ముందుండి అధికారం చేజిక్కించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.