Gopichand- Nagarjuna: టాలీవుడ్ లో ఒకప్పుడు విబిబిన్నమైన సినిమాలు తీసి ట్రెండ్ సెట్టర్ గా మారి ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ..ఈయన ఆలోచనలు అన్ని చాలా కొత్తగా ఉండేవి ఒకప్పుడు..షాట్ మేకింగ్ లో కానీ..కెమెరా యాంగిల్స్ వాడడం లో కానీ రామ్ గోపాల్ వర్మ PHD చేసాడు అనే చెప్పాలి..ఆ స్థాయిలో సరికొత్త ఒరవడిలోకి తెలుగు సినిమాని తీసుకెళ్లిన దర్శకుడు ఆయన.

అలాంటి దర్శకుడు ఇప్పుడు మతి చెడిపోయి బూతు సినిమాలు తీసుకుంటూ వస్తున్నా సంగతి మన అందరికి తెలిసిందే..ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఈయన బుర్రలో తొలచిన కొన్ని విచిత్రమైన ఆలోచనలను పంచుకున్నాడు..స్వతహాగా దేవుడిని మరియు మన ఇతిహాస చరిత్రలను నమ్మని రామ్ గోపాల్ వర్మ కొనేళ్ల క్రితం రామాయణం తియ్యాలనుకున్నాడట..ఆయన స్టైల్ లో సరికొత్త కోణం లో రామాయణం ని తియ్యడానికి అప్పట్లో స్క్రిప్ట్ కూడా రాసుకున్నాడట..ఈ విషయాన్నీ ఆయన ఈ ఇంటర్వ్యూ లో పంచుకున్నాడు.
అయితే రామ్ గోపాల్ వర్మ రామాయణం లో శ్రీ రాముని పాత్రకి గోపీచంద్ ని మరియు రావణాసురుడి పాత్రలో అక్కినేని నాగార్జున ని తీసుకుందాం అనుకున్నాడట..నాగార్జున ఏంటి రావణాసురుడు ఏంటి అని మీకు అనిపించొచ్చు..అలా విచిత్రంగా ఆలోచించడమే కదా రామ్ గోపాల్ వర్మ స్టైల్..తీస్తే వీళ్ళిద్దరితోనే తీస్తాను అని కంకణం కట్టుకొని కూర్చుకున్నాడట..ఇదే విషయాన్నీ వాళ్ళిద్దరి దగ్గరకి వెళ్లి చెప్పగా,వాళ్ళు నవ్వుకొని వదిలేసారట..అలా రామ్ గోపాల్ వర్మ తియ్యాలనుకున్న ఈ రామాయణం ఆరంభంలోనే అట్టకెక్కింది..ఆ తర్వాత నాగార్జున తో రామ్ గోపాల్ వర్మ ‘ఆఫీసర్’ అనే సినిమా తీసాడు..ఇది ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనేది మన అందరికి తెలిసిందే..ఈ చిత్రం తోనే నాగార్జున కి స్టార్ స్టేటస్ పోయింది.

అప్పట్లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో శివ , గోవిందా గోవిందా మరియు అంతం వంటి సినిమాలు వచ్చాయి..వీటిల్లో శివ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొట్టింది..నాగార్జున కి విపరీతమైన స్టార్ స్టేటస్ ని తెచ్చిపెట్టింది..ఏ డైరెక్టర్ అయితే నాగార్జున కి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టాడో..అదే డైరెక్టర్ కారణంగా స్టార్ స్టేటస్ పోవడం విచారకరం..ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ తో సినిమా చెయ్యాలంటే ఏ హీరోకైనా రిస్క్ అనే చెప్పాలి..అందుకే తనకి తోచిన విధంగా బూతు స్పీనేమాలు తీసుకుంటూ కాలం గడుపుతున్నాడు.