దేశంలో కరోనా రెండో దశ ఇంకా పూర్తి కాలేదని శాస్ర్తవేత్తలు సూచిస్తున్నారు. అన్ని స్టేట్లలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నా కేరళలో మాత్రం తన ప్రతాపాన్ని చూపెడతూనే ఉంది. ఈశాన్య స్టేట్లతోపాటు కేరళలో వైరస్ విస్తృతం కావడానికి కారణాలు తెలియడం లేదు. కేంద్ర ఆరోగ్య శాఖ సైతం ఈ పరిస్థితికి ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేరళలో నిత్యం పది వేలకు పైగా కేసులు బయటపడటంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ పరిస్థితుతు కేరళలో చేజారిపోయినట్లు భావిస్తున్నారు.
కరోనా తొలిదశలో వైరస్ వ్యాప్తి కట్టడికి కేరళ అనుసరించిన పద్దతిని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ప్రశంసించింది. కానీ ప్రస్తుతం అక్కడ పరిస్థితులు తారుమారయ్యాయి. ఢిల్లీ, మహారాష్ర్ట వంటి స్టేట్లలో కేసులు తగ్గుముఖం పట్టినా కేరళలో మాత్రం తగ్గడం లేదు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 40 శాతం ఒక్క కేరళలోనే ఉంటున్నాయి. దీంతో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 22 వేల పాజిటివ్ కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది.
కేరళలో ఆరు వారాలుగా 10 నుంచి 12 శాతం కేసులు రికార్డవుతున్నాయి. నిత్యం 10 నుంచి 15 వేల మందిలో వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయని త్రివేండ్రం మెడికల్ కాలేజి అసిస్టెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు. వైరస్ తీవ్రత పెరుగుతున్నా వ్యాక్సినేషన్ తీసుకోవడం తీవ్రత తగ్గించడంలో దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
కరోనా కేసులు రాష్ర్టంలో ఊహించని రీతిలో పెరగడం ఆందోళన కలిగిస్తోందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. మే 12న అత్యధికంగా 43 వేల కేసులతో గరిష్టానికి చేరుతుందన్నారు. రాష్ర్టంలో మధుమేహ బాధితులు ఎక్కువగా ఉండటంతో వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అయినా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.