శ్రీలంక పర్యటనలో యువ భారత జట్టును కరోనా కమ్మేసింది. భారత ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యాకు కరోనా సోకడంతో మిగతా టీం అంతా అలెర్ట్ అయ్యింది. అసలు ఎవరెవరికి కరోనా ఉంది.? అని తెలుసుకోవడానికి టీం అంతంటికి కరోనా టెస్టులు చేయిస్తోంది.
ఇక కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా మెలిగిన 8మంది ఆటగాళ్లను కూడా క్వారంటైన్ కు అధికారులు పంపించారు. ఇందులో ఫృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నట్టుగా చెబుతున్నారు.
నిజానికి ఈ శ్రీలంకతో మ్యాచ్ ముగిశాక భారత జట్టులోని ఫృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ లు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. బీసీసీఐ వీరిని సీనియర్ జట్టులోకి పంపడానికి రెడీ అయ్యింది. అయితే ఇప్పుడు కృనాల్ కు కరోనా కారణంగా వీరిద్దరూ కూడా క్వారంటైన్ లోకి పంపేందుకు రెడీ అయ్యింది.
తాజాగా ఈరోజు రాత్రి 8 గంటలకు శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో టీమిండియా తరుఫున ఎవరు ఆడుతారన్నది ఆసక్తిగా మారింది. టెస్టుల్లో నెగిటివ్ వచ్చిన వారికే రెండో టీ20లో ఆడించే అవకాశం ఉంది. ఈ రాత్రికి ఎవరు ఆడుతారన్నది తేలనుంది.