Kerala Rains: అల్పపీడన ప్రభావంతో కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే భారీ వర్షాలు కురిసే అవకావం ఉండడంతో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ కనుమల్లోని వయనాడ్, మున్నార్, ఇడుక్కి ఉత్తర కన్నడ, ముంబై, గోవా తీర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్న మరో 3 రోజులపాటు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురవనున్నాయి.