నిర్భయ కేసుపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు

నిర్భయ నిందితులను ఈ రోజు ఉదయం 5గంటల 30నిమిషాలకు ఉరితీశారు. అనంతరం వారి మృతదేహాలను  పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి పంపారు. అయితే వారిని ఉరి తీసిన అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేస్తూ.. ఒక ట్వీట్ చేశారు. దేశ రాజధానిలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తానని ప్రతిజ్ఞ చేశారు. “ఏ కుమార్తెకైనా” మరలా జరగకుండా చూసేందుకు పోలీసులు, కోర్టులు, రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం సమిష్టిగా కృషిచేయలని ఆయన పిలుపునిచ్చారు. 2012 […]

Written By: Neelambaram, Updated On : March 20, 2020 11:30 am
Follow us on

నిర్భయ నిందితులను ఈ రోజు ఉదయం 5గంటల 30నిమిషాలకు ఉరితీశారు. అనంతరం వారి మృతదేహాలను  పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి పంపారు. అయితే వారిని ఉరి తీసిన అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేస్తూ.. ఒక ట్వీట్ చేశారు. దేశ రాజధానిలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తానని ప్రతిజ్ఞ చేశారు. “ఏ కుమార్తెకైనా” మరలా జరగకుండా చూసేందుకు పోలీసులు, కోర్టులు, రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం సమిష్టిగా కృషిచేయలని ఆయన పిలుపునిచ్చారు.

2012 డిసెంబర్ 16 న కదులుతున్న బస్సులో ఆరుగురు వ్యక్తులు అతికిరాతకంగా ప్రవర్తిస్తూ.. నిర్భయ అనే వైద్య విద్యార్థుని అత్యాచారం చేసి బుస్సులో నుండి బయటకు విసిరేశారు. 12రోజుల పాటు మృతువుతో పోరాడి ఆమె తుది శ్వాస విడిచారు. ఆరుగురులో ఒక దోషి జైలులో ఉరి వేసుకొని చనిపోగా మరో వ్యక్తి మైనర్ కావడంతో మూడు సంవత్సరాల జైలు జీవితం అనంతరం విడిచిపెట్టారు. మిగిలిన నలుగుర్ని ఈ రోజు ఉరితీశారు.