A బ్లడ్ గ్రూప్ ఉన్నవాళ్ళకి కరోనా ముప్పు

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు  ఈ వైరస్  బారిన పడి (ఈ వ్యాసం రాసే సమయానికి) 9802  మంది చనిపోగా.. లక్షలాది మంది  ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక కోవిడ్ 19  విశ్వ వ్యాప్తంగా 177 దేశాల్లో తన కోరలు సాచి వికటాట్టహాసం చేస్తోంది .   భారత దేశం లోకూడా కరోనా పీడితుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది.  ఇప్పటివరకు తేలిన లెక్కల ప్రకారం భారత దేశంలో 194  మంది కోవిడ్ 19 భాదితులు […]

Written By: Neelambaram, Updated On : March 20, 2020 10:41 am
Follow us on

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు  ఈ వైరస్  బారిన పడి (ఈ వ్యాసం రాసే సమయానికి) 9802  మంది చనిపోగా.. లక్షలాది మంది  ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక కోవిడ్ 19  విశ్వ వ్యాప్తంగా 177 దేశాల్లో తన కోరలు సాచి వికటాట్టహాసం చేస్తోంది .   భారత దేశం లోకూడా కరోనా పీడితుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది.  ఇప్పటివరకు తేలిన లెక్కల ప్రకారం భారత దేశంలో 194  మంది కోవిడ్ 19 భాదితులు ఉన్నారు .ఈ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది ఈ విపత్తు ఏర్పడిన నాటి నుండి ఇప్పటిదాకా కరోనా బారిన పడి  ఇండియా లో మృతి చెందిన వారి సంఖ్య.నాలుగు కి మించక పోవడం కొంచెం ఆనందించ దగ్గ విషయమే …ఎందుకంటె అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా , జర్మనీ , ఫ్రాన్స్ వంటివి కూడా ఈ కరోనా దెబ్బకి విల విల్లాడి   పోతున్నాయి .అక్కడ మరణాల సంఖ్య వందలు ,వేలల్లో ఉంది

ఇలా ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కోవిడ్ 19 నివారణకు అనేక దేశాలు తమ వంతు పరిశోధనలు విస్తృతం చేశాయి.ఆ క్రమంలో మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో పలు అనుమానాలు ఉద్భవిస్తున్నాయి. అసలు ఎవరికి ఈ కరోనా వస్తుంది..? ఏ వయసు వారికి ఎక్కువగా సోకే అవకాశం ఉంది..? ఏ బ్లడ్ గ్రూప్ వారికి  కరోనా వల్ల ముప్పు    అన్న అనుమానాలు మనలో ఉన్నాయి.  ఈ క్రమంలో చైనాకు చెందిన వైద్య పరిశోధకులు కొంత సమాచారాన్ని ప్రపంచానికి అందించారు .

వీరి సమాచారం ప్రకారం ‘ఏ’ (A) బ్లడ్ గ్రూప్ కలిగినవారికి కరోనా వైరస్ త్వరగా సంక్రమిస్తుందని తేలింది. ఇక మిగతా గ్రూపుల విషయానికొస్తే.. ‘ఓ’ బ్లడ్ గ్రూప్ కలిగిన వారిపై  కాస్త నెమ్మదిగా.. కరోనా వైరస్ ప్రభావాన్ని చూపుతుందని తేల్చారు. గత కొన్నిరోజులుగా చైనా వైద్యులు ఈ అధ్యయనాన్ని ఉహాన్లో చేపట్టి ఈ విషయాలను మనకు తెలియ జేశారు.  కరోనా సోకిన  వారి ఫై పరిశోధనలు జరపగా.. వారిలో అధికులు  ‘ఏ’ బ్లడ్ గ్రూప్ కలిగినవారు ఉండటం  ఆ తరువాతి స్థానంలో ‘ఓ’ బ్లడ్ గ్రూప్ వారు ఉన్నారు. అంతేకాదు.. కరోనా సోకి ‘ఏ’ బ్లడ్ గ్రూపు వారే అధికంగా మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. సో.. ఏ బ్లడ్ గ్రూప్ వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది.
Prevention is better than cure